నగర శివారులో ఓ వ్యక్తి దారుణ హత్య… కాల్వలో మృతదేహం..!

హైదరాబాద్ మహానగర శివారులో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హతమార్చి కాల్వలో పడేశారు.

  • Balaraju Goud
  • Publish Date - 7:12 pm, Mon, 26 October 20

హైదరాబాద్ మహానగర శివారులో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా హతమార్చి కాల్వలో పడేశారు. స‌ంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు మండ‌లం భానూర్ లో ఈ దారుణం వెలుగుచూసింది. స‌త్య‌నారాయ‌ణ అనే వ్య‌క్తిని గుర్తు తెలియ‌ని దుండ‌గులు హ‌త్య చేశారు. అనంతరం మృతదేహం కనిపించకుండా ఉండేందుకు కాల్వ‌లో ప‌డేశారు. కాల్వలో తేలియాడుతున్న శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపట్టారు. ఇదిలావుంటే, త‌న భ‌ర్త‌ను గుర్తు తెలియ‌ని దుండ‌గులు బెదిరించి హ‌త్య చేశార‌ని మృతుని భార్య చెబుతుంది. అయితే, భార్యనే సత్యనారాయణను హ‌త్య చేయించింద‌ని అతని కుటుంబ‌స‌భ్యులు ఆరోపిస్తున్నారు. స‌త్య‌నారాయ‌ణను హ‌త్యకి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.