యూపీలో అంథవిశ్వాసం.. ఒకరు నాలుక, మరొకరు గొంతు కోసుకుని మొక్కులు..!

ఉత్తర భారత దేశంలో ఒళ్లు గగురుపొడిచే రెండు వేర్వేరు ఘటనలు చోటుచేసుకుంది. ఒకరు భక్తు మూఢ నమ్మకంతో నాలుక కోసుకుంటే, మరొకరు ఏకంగా గొంతే కోసుకున్నారు.

యూపీలో అంథవిశ్వాసం.. ఒకరు నాలుక, మరొకరు గొంతు కోసుకుని మొక్కులు..!
Follow us

|

Updated on: Oct 26, 2020 | 2:48 PM

ఒకవైపు బాబాకి కల వచ్చిందని నిధి కోసం అన్వేషించడానికి పురాతత్వ శాఖ నుంచి సామాన్యుల వరకు తవ్వకాలు మొదలుపెట్టారు. మరొకవైపు అశేష అనుయాయులున్న ఆధ్యాత్మిక ముసుగులో అనైతిక కార్యకలాపాలకు ఒడిగట్టారన్న ఆరోపణలు. అవసరమైతే జంతువులతో , మనుషులను బలి తీస్తున్నారు. ఇంకొక వైపు సూపర్ పవర్ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. సాంకేతిక విప్లవంతో అంతరిక్షంలో సుదూరంగా ఉన్న అంగారకుని మీదకు అంతరిక్ష నౌకలు పంపిస్తున్నాం. చంద్రుడిపై మానవ సహిత ప్రయోగాలకు సిద్ధమవుతున్నాం. ఆలోచనలు సుదూర అంతరాళం వైపు దూసుకుపోతున్నా మన విశ్వాసాలు మాత్రం పాతాళంలోనే ఉంటున్నాయి. ఇలాంటివి మన దేశంలో నిత్యకృత్యమవుతున్నాయి.

తాజాగా ఉత్తర భారత దేశంలో ఒళ్లు గగురుపొడిచే రెండు వేర్వేరు ఘటనలు చోటుచేసుకుంది. ఒకరు భక్తు మూఢ నమ్మకంతో నాలుక కోసుకుంటే, మరొకరు ఏకంగా గొంతే కోసుకున్నారు. దసరా పర్వదినం రోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాబేరు ప్రాంతంలోని భాటి గ్రామ ఆలయంలో 22 ఏళ్ల యువకుడు తన నాలుకను కోసుకుని అమ్మవారికి కానుకగా ఇచ్చాడు. ఆత్మారామ్ అనే 22 ఏళ్ల యువకుడు ఆలయానికి వచ్చి తన నాలుకను కత్తిరించి దేవుడికి నైవేద్యంగా అర్పించాడని పోలీసులు చెప్పారు. తీవ్ర రక్తస్రావమైన ఆత్మారాంను ఆసుపత్రికి తరలించామని, అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని పోలీసులు చెప్పారు. తన కుమారుడికి మతిస్థిమితం సరిగా లేదని, నవరాత్రి సందర్భంగా నాలుక కోసుకున్నాడని ఆత్మారాం తండ్రి చెప్పారు. మరో ఘటనలో యూపీలోని కురారా ప్రాంతంలోని శివాలయంలో 49 ఏళ్ల రుక్మిణి మిశ్రా కోకేశ్వర్ ఆలయంలో కత్తితో గొంతు కోసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన రుక్మిణి మిశ్రాను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు.మూఢనమ్మకాల వల్లనే వీరిద్దరూ ఈ చర్యకు పాల్పడ్డారని జిల్లా ఎస్పీ చెప్పారు. రెండు ఘటనలకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు.