కాన్పూర్‌లో ఓ వ్యక్తి కిరాతకం.. ఇంటి ముందుకొచ్చిన ఆవును మందలించినందుకు దారుణ హత్య!

మనుషుల్లో రాను రాను మానవత్వం మంటగలుస్తోంది. ఆవును అదిమినందుకు ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపాడు ఓ కిరాతకుడు. కర్రతో ఆవును మందలించిన పాపానికి 46 ఏళ్ల వ్యక్తిని అత్యంత పాశవికంగా హతమార్చాడు.

కాన్పూర్‌లో ఓ వ్యక్తి కిరాతకం.. ఇంటి ముందుకొచ్చిన ఆవును మందలించినందుకు దారుణ హత్య!
Follow us

|

Updated on: Dec 22, 2020 | 7:53 PM

man beaten to death in kanpur: మనుషుల్లో రాను రాను మానవత్వం మంటగలుస్తోంది. ఆవును అదిమినందుకు ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపాడు ఓ కిరాతకుడు. కర్రతో ఆవును మందలించిన పాపానికి 46 ఏళ్ల వ్యక్తిని అత్యంత పాశవికంగా హతమార్చాడు. భార్యాపిల్లల ముందే అతనిని కొట్టి చంపారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే లోపే నిందితుడు తన కుటుంబంతో సహా పలాయనం చిత్తగిత్తగించాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్‌లోని గోవింద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహదేవ్ నగర్ బస్తీకి చెందిన ఆయుష్ యాదవ్ డెయిరీ ఫామ్ నిర్వహిస్తున్నాడు. అతనికి చెందిన ఒక ఆవు.. అదే ప్రాంతానికి చెందిన రమణ గుప్తా అనే వ్యక్తి ఇంటి ముందుకు వచ్చింది. ఆ సమయంలో రమణ గుప్తా పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. దీంతో రమణ గుప్తా కర్రతో ఆ ఆవును వెళ్లగొట్టాడు. ఇదీ గమనించిన ఆయుష్ యాదవ్… రమణ్ గుప్తాతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. ఆయుష్ యాదవ్ ఆవేశంతో కర్రతో రమణ్ గుప్తాపై విచక్షరాహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రమణ్ గుప్తాను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు.

మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, అప్పటికే నిందితుడు ఆయూష్ యాదవ్ తన కుటుంబసభ్యులతో సహా పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..