బాబాయ్‌ మందలించాడని..తమ్ముడిపై దాడి

కడప జిల్లాలో ఓ యువకుడు ఉన్మాదిలా మారాడు..13 ఏళ్ల తమ్ముడిపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. అన్న చేతిలో తీవ్రంగా గాయపడిన తమ్ముడి పరిస్థితి విషమంగా ఉండటంతో..వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. ఈ సంఘటన జిల్లాలోని పెండ్లిమర్రి మండలం వెల్లటూరు గ్రామంలో చోటు చేసుకుంది. జరిగిన ఘటనతో గ్రామంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వెల్లటూరు గ్రామానికి చెందిన భాస్కర్‌ రెడ్డి..నరసింహరెడ్డి ఇద్దరూ అన్నాతమ్ముళ్లు, కాగా భాస్కర్‌ రెడ్డి కుమారుడు రమణారెడ్డి బీటెక్‌ వరకు చదువుకున్నాడు. కానీ మతిస్థిమితం […]

బాబాయ్‌ మందలించాడని..తమ్ముడిపై దాడి
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 27, 2019 | 2:20 PM

కడప జిల్లాలో ఓ యువకుడు ఉన్మాదిలా మారాడు..13 ఏళ్ల తమ్ముడిపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. అన్న చేతిలో తీవ్రంగా గాయపడిన తమ్ముడి పరిస్థితి విషమంగా ఉండటంతో..వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. ఈ సంఘటన జిల్లాలోని పెండ్లిమర్రి మండలం వెల్లటూరు గ్రామంలో చోటు చేసుకుంది. జరిగిన ఘటనతో గ్రామంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వెల్లటూరు గ్రామానికి చెందిన భాస్కర్‌ రెడ్డి..నరసింహరెడ్డి ఇద్దరూ అన్నాతమ్ముళ్లు, కాగా భాస్కర్‌ రెడ్డి కుమారుడు రమణారెడ్డి బీటెక్‌ వరకు చదువుకున్నాడు. కానీ మతిస్థిమితం సరిగా లేకపోవడంతో..తరచూ తండ్రి భాస్కర్‌రెడ్డితో గొడవలు పడుతూ దాడి చేసేవాడు. దీంతో నరసింహరెడ్డి  తన అన్న కొడుకైన రమణారెడ్డిని పలు సందర్భాల్లో మందలిస్తూ వచ్చేవాడు. అంతేకాదు, ఒకటీ రెండు సార్లు చెయి కూడా చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అదంతా మనసులో పెట్టుకున్న రమణారెడ్డి బాబాయ్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే నరసింహరెడ్డి..కొడుకు నందకిషోర్‌పై తన ప్రతాపం చూపించాడు. ఏడవ తరగతి చదువుతున్న నందకిషోర్‌ను రమణారెడ్డి గొంతుకోసి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడివున్న బాధితున్ని హుటాహుటినా కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందజేశారు. ప్రమాదం తప్పి నందకిషోర్‌ పరిస్థితి నిలకడగా ఉండటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

తెలుగురాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగురాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..