Breaking News
  • తెలంగాణలో మరో 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదు.. తెలంగాణ లో ఇప్పటి వరకు 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. తెలంగాణలో కరోనా వైరస్ తో 9 మంది మృతి చెందారు.. ఈరోజు మరో ముగ్గురు ఆసుపత్రి నుండి డిచ్ఛార్జ్ అయ్యారు.. మొత్తం 17 మంది కోలుకున్నారు..
  • అసలే జనం భయంతో బతికేస్తున్నారు. ఈ టైమ్‌లో కరోనాపై అవాకులు చవాకులు పేల్చేవాళ్లు ఎక్కువయ్యారు. కొందరు ఫేక్‌ న్యూస్‌ పోస్టు చేస్తుంటే కొందరు విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై, వైద్యులపై ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మొత్తం రాష్ట్ర పరిస్థితిని ఆరా తీస్తున్నారు.
  • ఏలూరులో ఒక్కసారిగా ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు తెరమీదకు వచ్చాయి. ఇంకెన్ని ఉంటాయోనని ప్రజలు భయపడుతుంటే అలాంటి హై రిస్క్‌ జోన్‌లో నిరంతరం పని చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం సిటీలో 144 సెక్షన్‌ అమలవుతోంది. కుటుంబాలకు దూరంగా రెడ్‌జోన్‌లో పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు.
  • ప్రతీది కరోనా కాదు.. పొడిదగ్గు తుమ్ములు ఉంటే వాయుకాలుష్యం. దగ్గు, తెమడ, ముక్కు కారడం, తుమ్ములు వస్తే జలుబు. దగ్గు, తెమడ, తుమ్ములు, ముక్కు కారడం, ఒంటి నొప్పులు, బలహీనత, తేలికపాటి జ్వరం ఫ్లూ లక్షణాలు. పొడిదగ్గు, తుమ్ములు, ఒంటి నొప్పులు, అధిక జ్వరం, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇవన్నీ కొవిడ్‌-19 లక్షణాలు. ప్రతీది కరోనా కాదు.. కంగారు పడొద్దు..
  • నిజాముద్దీన్ మర్కజ్ కేసులో ఢిల్లీ క్రైం బ్రాంచ్ నోటీసులు. తబ్లీఘీ-జమాత్ చీఫ్ మౌలానా సాద్ సహా 7గురు నిందితులకు నోటీసులు. నిబంధనలు ఎందుకు అతిక్రమించారో రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశం. నిందితుల ఇళ్లకు నోటీసులు పంపించిన క్రైం బ్రాంచ్.

వామ్మో.. ఇంతటి ఆటవిక చర్యలా.. ఆవుదూడను చంపావంటూ.. అందుకు కూతుర్ని..!

Man asked to marry minor daughter to atone for accidentally killing a calf in MP, వామ్మో.. ఇంతటి ఆటవిక చర్యలా.. ఆవుదూడను చంపావంటూ.. అందుకు కూతుర్ని..!

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. చట్టాల్ని పక్కన పెట్టి.. తాము చెప్పిందే శాసనమన్నట్లు ప్రవర్తిస్తున్నారు అక్కడి గ్రామ పంచాయితీ పెద్దలు. ఇటీవల ఓ లేగదూడ ప్రమాదవశాత్తు మృతిచెందింది. అయితే దానికి కారణం ఓ వ్యక్తి అంటూ.. ఆయనకు విచిత్రమైన శిక్ష విధించారు. అది కూడా సభ్య సమాజం తలదించుకునే శిక్ష విధించారు. తన సొంత బిడ్డనే పెళ్లి చేసుకోవాలంటూ సదరు గ్రామ పంచాయితీ పెద్దలు ఆదేశించారు. లేగదూడను చంపిన పాపానికి ఇలా చేస్తే.. ప్రాయశ్చిత్తం కలుగుతుందంటూ సదరు బాధితుడికి సెలవిచ్చారు.

వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లా పతారియాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. తన బైక్‌పై వెళ్తుండగా దూడ అడ్డం వచ్చింది. దీంతో బైక్‌ అదుపు తప్పి ఆ దూడను ఢీకొట్టింది. దీంతో ఆ దూడ మరణించింది. అయితే సదరు లేగదూడ మృతికి అతడే కారణమని గ్రామ పంచాయతీ పెద్దలు తీర్మానం చేశారు. అంతేకాదు దూడ మరణానికి పరిహారం కూడా చేసుకోవాలని చెప్పారు. దీంతో ఆ వ్యక్తి ఉత్తరప్రదేశ్ వెళ్లి గంగానదిలో స్నానం చేసి వచ్చాడు. అనంతరం ఊరి వాళ్లందరికీ అన్నదానం చేసేందుకు కూడా సిద్ధమయ్యాడు. ఇది అంతా పట్టించుకోని పంచాయతీ పెద్దలు.. పంచాయితీని పెద్దది చేసేలా ప్లాన్ వేశారు. అన్నదానం కాదు..నీ సొంత మైనర్‌ బిడ్డనే పెళ్లి చేసుకోవాలంటూ ఆదేశించారు. అందుకు అనుగుణంగా పెళ్లి ఏర్పాట్లు కూడా చేశారు. అయితే విషయం గురించి కొందరు పోలీసులకు ఫిర్యాదులు చేయడంతో.. వెంటనే పోలీసులు సదరు గ్రామంలోకి ఎంటర్ అయ్యారు.

మైనర్‌కు పెళ్లి చేయడం నేరమని పోలీసులు, అధికారులు చెప్పినా పంచాయతీ పెద్దలు వినిపించుకోలేదు. దీంతో పోలీసులు ఆ అమ్మాయి ఆధార్‌ కార్డు తెప్పించి చూసి ఆమె వయస్సు 14 సంవత్సరాలుగా నిర్ధారించారు. మైనర్‌కు పెళ్లి చేయవద్దని తల్లిదండ్రులను, గ్రామపెద్దలను గట్టిగా హెచ్చరించారు. అయితే ఈ ఘటనపై ఎవరిపై కూడా కేసులు నమోదు కాలేదు.

Related Tags