Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

జమ్మూ బస్టాండ్ లో గ్రనేడ్ విసిరిన ఉగ్రవాది అరెస్ట్

, జమ్మూ బస్టాండ్ లో గ్రనేడ్ విసిరిన ఉగ్రవాది అరెస్ట్

జమ్మూ బస్టాండ్‌లో ఇవాళ ఉదయం గ్రనేడ్ దాడికి పాల్పడిన వ్యక్తిని ఎట్టకేలకు జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని యాసిర్ భట్ గా గుర్తించారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాద సంస్థ హిజ్‌బుల్ ముజాహిదీన్ హస్తం ఉన్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది. కుల్గాం నుంచి బుధవారమే జమ్మూకి వచ్చిన అతడు.. దాడికి పాల్పడిన తర్వాత జమ్మూ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అతడిని పోలీసులు వలపన్ని పట్టుకున్నట్టు జమ్మూ ఐజీపీ ఎంకే సిన్హా వెల్లడించారు. ఘటనా ప్రాంతంలోని సీసీటీవీ ఫూటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించినట్టు ఆయన తెలిపారు. కుల్గాంలోని హిజ్‌బుల్ కమాండర్ ఫరూక్ అహ్మద్ భట్ అలియాస్ ఉమర్‌… యాసిర్కు గ్రనేడ్ సమకూర్చినట్టు సిన్హా తెలిపారు.

, జమ్మూ బస్టాండ్ లో గ్రనేడ్ విసిరిన ఉగ్రవాది అరెస్ట్

కాగా గ్రనేడ్ పేలుడు కేసులో ఫరూక్ సహా మరో ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు పత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కాగా ఇవాళ ఉదయం జమ్మూలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ బస్సు కింద గ్రనేడ్ పేలడంతో 32 మంది గాయపడ్డారు. తీవ్ర గాయాలైన 17 ఏళ్ల ఉత్తరాఖండ్ టీనేజర్ మహ్మద్ షరిక్ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
దాడిలో గాయపడ్డ వారిలో స్థానిక కాశ్మీరీలతో పాటు ఇద్దరు బిహారీలు, ఒకరు చత్తీస్‌గఢ్, మరకొరు హర్యానాకు చెందిన వ్యక్తి ఉన్నారు. ఈ ఘటనతో జమ్మూ పోలీసులు, భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. నగరవ్యాప్తంగా భద్రతను కట్టదిట్టం చేశారు. కాగా, జమ్మూ దాడిని కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఖండించారు. మృతుడి కుటుంబానికి రూ.5 లక్షలు, గాయపడ్డవారికి రూ.20వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.