చంద్రయాన్ 2 ప్రయోగంపై అతిగా ప్రచారం : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

చంద్రయన్ 2 ప్రయోగంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ ఆర్ధిక పతనం వెంటాడుతున్న పరిస్థితి నుంచి ప్రజలను మళ్లించడానికే చంద్రయాన్ 2 ప్రయోగాన్ని అతిగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి రాకముందు ఇలాంటి ప్రయోగాలు జరగలేదా అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ శాసన సభా సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే దీదీ ఈ వ్యాఖ్యలు చేసి వేడిపుట్టించారు. చంద్రయాన్ ప్రయోగం దేశంలోనే మొదటిసారి జరుగుతుందా? గతంలో […]

చంద్రయాన్ 2 ప్రయోగంపై అతిగా ప్రచారం : బెంగాల్ సీఎం మమతా  బెనర్జీ
Follow us

| Edited By:

Updated on: Sep 06, 2019 | 7:05 PM

చంద్రయన్ 2 ప్రయోగంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ ఆర్ధిక పతనం వెంటాడుతున్న పరిస్థితి నుంచి ప్రజలను మళ్లించడానికే చంద్రయాన్ 2 ప్రయోగాన్ని అతిగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి రాకముందు ఇలాంటి ప్రయోగాలు జరగలేదా అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ శాసన సభా సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లోనే దీదీ ఈ వ్యాఖ్యలు చేసి వేడిపుట్టించారు.

చంద్రయాన్ ప్రయోగం దేశంలోనే మొదటిసారి జరుగుతుందా? గతంలో బీజేపీ అధికారంలోకి రాకముందు ఇటువంటి ఉపగ్రహ ప్రయోగాలు ఎప్పుడూ జరగలేదా అంటూ మమతా బెనర్జీ ప్రశ్నించారు. దేశమంతా చంద్రయాన్ 2 సెక్సెస్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశ ప్రజలతో పాటు ప్రధాని మోదీ కూడా దీన్ని నేరుగా వీక్షించనున్నారు. దేశం ప్రస్తుతం ఆర్ధిక మందగమనంతో సాగుతుందని, ఆర్ధిక పతనం కొనసాగుతున్న ఈ పరిస్థితిలో కేంద్రం ఈ ప్రయోగాన్ని అనుకూలంగా మలచుకుందని దీదీ ఆరోపించారు.