టీఎంసీలో ఇకపై ‘కాంగ్రెస్’ పదం కనిపించదు

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ  కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ పార్టీకి చెందిన లోగోల్లో ‘కాంగ్రెస్’ అనే పదం కనపడకుండా లోగోను విడుదల చేసింది. గతంలో ఆ పార్టీ లోగోల్లో తృణమూల్‌ పక్కనే కాంగ్రెస్‌ అనే పదం ఉన్న విషయం తెలిసిందే. ఇకపై కొత్త  ఫార్మా‌ట్ మాత్రమే వాడుకలో ఉంటుందని స‌ృష్టం చేసింది. మమతా బెనర్జీ మొదట కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్‌తో […]

టీఎంసీలో ఇకపై ‘కాంగ్రెస్’ పదం కనిపించదు
Follow us

|

Updated on: Mar 23, 2019 | 7:13 PM

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ  కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆ పార్టీకి చెందిన లోగోల్లో ‘కాంగ్రెస్’ అనే పదం కనపడకుండా లోగోను విడుదల చేసింది. గతంలో ఆ పార్టీ లోగోల్లో తృణమూల్‌ పక్కనే కాంగ్రెస్‌ అనే పదం ఉన్న విషయం తెలిసిందే. ఇకపై కొత్త  ఫార్మా‌ట్ మాత్రమే వాడుకలో ఉంటుందని స‌ృష్టం చేసింది. మమతా బెనర్జీ మొదట కాంగ్రెస్ పార్టీ నాయకురాలు అన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్‌తో విభేదించి .. టీఎంసీని స్థాపించారు. దాదాపు 21 ఏళ్ల తర్వాత తమ పార్టీ లోగోల్లోంచి ‘కాంగ్రెస్‌’ అనే పదాన్ని తొలగించింది టీఎంసీ . ఆ పార్టీ కొత్త లోగోలో తృణమూల్‌ అనే పదం ఆకుపచ్చ రంగులో కనపడుతోంది. దానిపై రెండు పుష్పాలు ఉన్నాయి. వెనకవైపున నీలిరంగు ఉంటుంది.

తమ పార్టీకి చెందిన బ్యానర్లు, పోస్టర్లతో పాటు ఇతర అన్ని వ్యవహారాల్లోనూ కాంగ్రెస్‌ అనే పదాన్ని తొలగించారు. అయితే, ఎన్నికల సంఘం వద్ద నమోదైన పేరులో మాత్రం తృణమూల్‌ కాంగ్రెస్‌గానే ఉంటుందని ఆ పార్టీ తెలిపింది. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఆ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయింది.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?