Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

కాంగ్రెస్ పార్టీకి నాలుగు పార్టీల ఝలక్ ! ఆ మీటింగ్‌కి గైర్హాజర్ !

All opposition parties to discuss the political situation in the country., కాంగ్రెస్ పార్టీకి నాలుగు పార్టీల ఝలక్ ! ఆ మీటింగ్‌కి గైర్హాజర్ !

జేఎన్‌యు ఘటన, సీఏఏపై దేశంలో వెల్లువెత్తిన నిరసనలతో సహా ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కాంగ్రెస్ ఆధ్వర్యాన సోమవారం ప్రతిపక్షాల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరు కావలసిందిగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆయా విపక్షాలకు లేఖలు రాశారు. అయితే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆధ్వర్యంలోని ‘ఆప్’, మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ, మహారాష్ట్ర లోని శివసేన ఈ సమావేశానికి హాజరు కావడంలేదని ప్రకటించాయి. ఈ మీటింగ్‌కి తమకు ఆహ్వానం అందలేదని, అందువల్ల తాము రావడంలేదని సేన వర్గాలు వెల్లడించాయి.

ఇక రాజస్తాన్ లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రభుత్వానికి తాము బయటినుంచి మద్దతు తెలిపామని, అయితే రెండోసారి కాంగ్రెస్ నేతలు మా పార్టీవారిని తమ పార్టీలో చేరాల్సిందిగా కోరారని మాయావతి తెలిపారు. ఇది అనైతికమని ఆమె ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి ఎలా హాజరవుతామని ఆమె ప్రశ్నించారు. అయితే సీఏఏ, ఎన్నార్సీలకు మేం వ్యతిరేకమన్నారు. ఇక సీఏఏకి నిరసనగా కోల్‌కతాలో జరిగిన ‘భారత్ బంద్’ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తమను చిన్నచూపు చూసిందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కాగా- ఈ సమావేశానికి ఎన్సీపీ, డీఎంకే, ఐయుఎంఎల్, లెఫ్ట్, ఆర్జేడీ వంటి పార్టీలు హాజరవుతున్నాయి.