ఆ టికెట్లు టీడీపీ హయాంలో ప్రచురించినవే: మల్లాది విష్ణు

Malladi Vishnu slams BJP Leaders over religion campaigns in Tirumala, ఆ టికెట్లు టీడీపీ హయాంలో ప్రచురించినవే: మల్లాది విష్ణు

తిరుమలలో ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం వివాదం ముదిరింది. ఈ విషయంలో ప్రభుత్వ, విపక్షాల మధ్య మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. దీనిపై చర్య తీసుకోవాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తుండగా.. ఆ టికెట్లను ప్రచురించింది టీడీపీ ప్రభుత్వమేనని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. ఆర్టీసీ టికెట్లపై హజ్, జెరూసలేం యాత్రల ప్రచారం చేసింది చంద్రబాబేనని ఆయన అన్నారు. నెల్లూరు నుంచి తిరుపతికి టికెట్లు ఎలా వెళ్ళాయో విచారణ జరుగుతుందని.. చంద్రబాబు హయాంలో దేవాలయాల్లో జరిగినన్ని అపచారాలు మరెప్పుడూ జరగలేదని తూర్పారబట్టారు.

బాబు హయాంలో దుర్గ గుడి, శ్రీశైలం దేవాలయాల్లో క్షుద్రపూజలు జరిగాయని.. రాష్ట్రంలో అనేక దేవాలయాలు దుర్మార్గంగా కూల్చేశారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు అనేక తప్పులు చేస్తే మంత్రులుగా ఉండి బీజేపీ నేతలు ఏం చేశారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. చంద్రబాబు ట్రాప్‌లో పడి బీజేపీ నేతలు ప్రభుత్వంపై బురద చల్లోద్దని ఆయన ఆక్షేపించారు. టీడీపీ, బీజేపీ ఇద్దరు కలిసి సీఎం జగన్‌పై హిందూ వ్యతిరేకి అనే ముద్రవేసే కుట్ర చేస్తున్నారని.. ప్రభుత్వం, సీఎం జగన్ పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *