మాలిలో మారణహోమం..

పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో జాతు మధ్య విభేధాలు భగ్గుమన్నాయి. గత కొన్నేళ్లుగా ఓ వర్గం ప్రజలనే లక్ష్యంగా చేసుకుని నరమేధానికి పాల్పడుతున్నారు. తాజాగా ఆదివారం అర్ధరాత్రి సంగ పట్టణంలోని “సొబామే ద” గ్రామాన్ని ఆయుధాలతో వచ్చిన దుండగులు చుట్టుముట్టారు. అక్కడి ప్రజలను ముట్టడించి దాదపు 100 మందిని సజీవదహనం చేశారు. పూర్తిగా కాలిపోయిన మృతదేహాలు, గుండెలవిసేలా రోదించే బాధిత కుటుంబీకులతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన జరిగినప్పటి నుంచి గ్రామానికి చెందిన మరో […]

మాలిలో మారణహోమం..
Follow us

| Edited By:

Updated on: Jun 11, 2019 | 10:49 AM

పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో జాతు మధ్య విభేధాలు భగ్గుమన్నాయి. గత కొన్నేళ్లుగా ఓ వర్గం ప్రజలనే లక్ష్యంగా చేసుకుని నరమేధానికి పాల్పడుతున్నారు. తాజాగా ఆదివారం అర్ధరాత్రి సంగ పట్టణంలోని “సొబామే ద” గ్రామాన్ని ఆయుధాలతో వచ్చిన దుండగులు చుట్టుముట్టారు. అక్కడి ప్రజలను ముట్టడించి దాదపు 100 మందిని సజీవదహనం చేశారు. పూర్తిగా కాలిపోయిన మృతదేహాలు, గుండెలవిసేలా రోదించే బాధిత కుటుంబీకులతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ ఘటన జరిగినప్పటి నుంచి గ్రామానికి చెందిన మరో 19 మంది ఆచూకీ తెలియరావడం లేదని అధికారులు వెల్లడించారు. మృతులంతా వేట, వ్యవసాయంపై ఆధారపడి జీవించే “డొగొన్‌” తెగ ప్రజలే అని తెలిపారు. ఇస్లామిక్‌ ఉగ్రవాదుల మద్దతుతో ఫులానీ సంచార తెగవారే ఈ మారణహోమానికి పాల్పడి ఉండొచ్చనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఫులానీ తెగవారు కానీ.. ఇస్లామిక్‌ ఉగ్రవాదులు కానీ ఈ దాడితో తమకు సంబంధమున్నట్లు ప్రకటించుకోలేదు.