సెల్ ఫోన్ల లారీ చోరీ

సెల్ ఫోన్లతో వెళ్తున్న ఓ లారీ కంటైనర్ ను దుండగులు అపహరించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా తడ మండలంలో చోటుచేసుకుంది. తడ సమీపంలో ఉన్న శ్రీ సిటీ నుంచి కోల్ కతాకు లోడ్ తో వెళ్తున్న లారీని, నేషనల్ హైవేపై లిఫ్ట్ కోసం ఆపి, డ్రైవర్ ను కొట్టి కిందపడేసి లారీతో ఉడాయించాడు కొంతమంది దుండగులు. లారీలో ఉన్న సెల్ ఫోన్లను వేరే లారీలోకి మార్చి ఖాళీ లారీని కావలి వద్ద వదిలేశారు. చెట్టుకు కట్టేసిన […]

సెల్ ఫోన్ల లారీ చోరీ
Follow us

|

Updated on: Feb 13, 2019 | 12:27 PM

సెల్ ఫోన్లతో వెళ్తున్న ఓ లారీ కంటైనర్ ను దుండగులు అపహరించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా తడ మండలంలో చోటుచేసుకుంది. తడ సమీపంలో ఉన్న శ్రీ సిటీ నుంచి కోల్ కతాకు లోడ్ తో వెళ్తున్న లారీని, నేషనల్ హైవేపై లిఫ్ట్ కోసం ఆపి, డ్రైవర్ ను కొట్టి కిందపడేసి లారీతో ఉడాయించాడు కొంతమంది దుండగులు. లారీలో ఉన్న సెల్ ఫోన్లను వేరే లారీలోకి మార్చి ఖాళీ లారీని కావలి వద్ద వదిలేశారు. చెట్టుకు కట్టేసిన డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా జరిగిన ఉదాంతం బయటకు వచ్చింది. కాగా.. దుండగులు ఎవరు అన్నది ఇంకా తెలియరాలేదు. డ్రైవర్ నే కావాలని చేశాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.