ఆ రెండు భయాలతో అడవుల్లోకి పారిపోతున్న అక్కడి ఆదిమ తెగ..!

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి దాటికి 54వేల మంది ప్రాణాలు కోల్పోగా.. పదిలక్షల మందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఒక్కోదేశం ఒక్కోతీరును అవలంభిస్తోంది. దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్ విధిస్తూ.. రోగులకు చికిత్స అందిస్తున్నాయి. ఈ క్రమంలో సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎంతో మంది ఆహారంలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక తాజగా మలేషియాలో ఓ తెగకు చెందిన […]

ఆ రెండు భయాలతో అడవుల్లోకి పారిపోతున్న అక్కడి ఆదిమ తెగ..!
Follow us

| Edited By:

Updated on: Apr 04, 2020 | 5:50 PM

ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి దాటికి 54వేల మంది ప్రాణాలు కోల్పోగా.. పదిలక్షల మందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు. ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో ఒక్కోదేశం ఒక్కోతీరును అవలంభిస్తోంది. దాదాపు అన్ని దేశాలు లాక్‌డౌన్ విధిస్తూ.. రోగులకు చికిత్స అందిస్తున్నాయి. ఈ క్రమంలో సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎంతో మంది ఆహారంలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇక తాజగా మలేషియాలో ఓ తెగకు చెందిన ప్రజలు కరోనా భయంలో గ్రామాలు విడిచి అడవుల్లోకి పారిపోతున్నారు. ఆ దేశంలోని “ఆరెంజ్ అస్లి” అనే ఆదిమ తెగ.. వారు నివసించే ఊర్లను వదిలేసి సమీప అభయారణ్యాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. ఇక్కడ తమకి ఆహారం ఎలా సంపాదించుకోవాలో తెలుసని చెబుతున్నారట ఆ దేశంలోని జమేరీ అనే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.

ఈ తెగకు చెందిన వారు కడుపేదరికంలో మగ్గుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు..వీరిలో పోషకాహారలోపం ఎక్కువ. ఈ క్రమంలో వైరస్‌ ప్రభావం ఇలాంటి వారిపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కూరగాయలు, పండ్లు అమ్ముకుంటే వారు జీవనం సాగిస్తున్నారు. దీని ద్వారా వచ్చే ఆదాయమే వీరికి జీవనాధారం. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో ఆ ఆదాయం కూడా తగ్గిపోవడంతో.. ఆహారం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అడవుల్లోకి వెళ్లడమే బెటర్‌ అనుకుని వెళ్లిపోయారు. అయితే మరికొంతమంది మాత్రం ఆహారం కోసం అడవుల్లోకి వెళ్లేందుకు కూడా భయపడుతున్నారట. ఆ గ్రామానికి చెందిన ఓ పెద్దాయన.. ప్రస్తుతం కరోనా తమ బతులకుల్లో తీవ్ర భయాందోళనలను సృష్టించిందని.. ఈ వైరస్‌ వచ్చినా తమ ప్రాణాలను తీస్తుందని.. ఇలానే ఉంటే ఆకలి కూడా తమ ప్రాణాలను తీస్తుందని వాపోయారట. మొత్తానికి మలేషియాలో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉందని అర్ధమవుతోంది.