పర్యాటకులెవరూ తమ దేశానికి రావద్దంటున్న మలేషియా

కరోనా వైరస్‌ కాసింతైనా తెరపిస్తుందనుకుంటే అదేమో రోజురోజుకీ విజృంభిస్తోంది.. ఈ టైమ్‌లో ఎక్కడికి వెళ్లకుండా ఇంటిపట్టున ఉండటమే ఉత్తమం.. అన్‌లాక్‌ మార్గదర్శకాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడికైనా వెళ్లవచ్చు అంటే కుదరదు..

పర్యాటకులెవరూ తమ దేశానికి రావద్దంటున్న మలేషియా
Follow us

|

Updated on: Sep 12, 2020 | 11:31 AM

కరోనా వైరస్‌ కాసింతైనా తెరపిస్తుందనుకుంటే అదేమో రోజురోజుకీ విజృంభిస్తోంది.. ఈ టైమ్‌లో ఎక్కడికి వెళ్లకుండా ఇంటిపట్టున ఉండటమే ఉత్తమం.. అన్‌లాక్‌ మార్గదర్శకాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడికైనా వెళ్లవచ్చు అంటే కుదరదు.. మనం వస్తామంటే ఎదురొచ్చి స్వాగతం పలికేందుకు కొన్ని దేశాలు సిద్ధంగా లేవు.. కాసింత టైమ్‌ దొరికితే చాలు మలేషియాకు వెళ్లివచ్చే పర్యాటకులకు ఇప్పుడో పెద్ద ఝలక్‌.. భారత్‌తో పాటు మరో 22 దేశాల పౌరుల ప్రవేశాన్ని రద్దు చేస్తూ మలేషియా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది..

కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ఆ దేశం తీసుకున్న నిర్ణయం ఇది! తమ దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మలేషియా ప్రభుత్వం చెప్పింది కూడా! ఈ ఏడాది చివరి వరకు ఈ నిషేధం కొనసాగుతుందట! దేశంలో ఒక్క కరోనా కేసు కూడా లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది అక్కడి ప్రభుత్వం. నిజానికి మలేషియాకు నాలుగు డబ్బులు వస్తున్నాయంటే అది పర్యాటక రంగం నుంచే! అది కూడా వద్దనుకుంది ప్రభుత్వం.. అదలా ఉంచితే, మలేషియా పర్యాటకరంగంలో బోలెడంత ఉపాధి దొరుకుతుందని ఆశ చూపించి కొందరు ఏజెంట్లు విజిటింగ్‌ వీసాలపై మనవాళ్లను అక్కడికి తీసుకెళ్లారు.. ఇక అక్కడ పరిస్థితులు ఊహించినట్టు లేకపోవడంతో చాలా మంది అప్పోసొప్పో చేసి స్వదేశానికి వచ్చేశారు.. ఇంకొందరు అక్కడే ఉండిపోయారు.. ఇప్పుడు మలేషియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అక్కడ నుంచి ఇండియాకు రాలేని పరిస్థితి వచ్చేసింది.. వారి వెతలు ఎప్పుడు తీరతాయో చూడాలి.