కరోనా భయంతో నో ఎంట్రీ.. ఆ షిప్‌లో 2 వేల మంది..!

చైనాలో ప్రాణం పోసుకొని 73దేశాలను గడగడలాడిస్తోంది కరోనావైరస్. చైనాతో పాటు ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాలో మరణమృదంగం మోగిస్తోంది. కోవిద్ 19 భయంతో దాదాపు 2,000 మందితో కూడిన విహార నౌకను తమ తీరంలోకి

కరోనా భయంతో నో ఎంట్రీ.. ఆ షిప్‌లో 2 వేల మంది..!
Follow us

| Edited By:

Updated on: Mar 08, 2020 | 4:03 PM

చైనాలో ప్రాణం పోసుకొని 73దేశాలను గడగడలాడిస్తోంది కరోనావైరస్. చైనాతో పాటు ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియాలో మరణమృదంగం మోగిస్తోంది. కోవిద్ 19 భయంతో దాదాపు 2,000 మందితో కూడిన విహార నౌకను తమ తీరంలోకి రాకుండా థాయలాండ్, మలేసియా అడ్డుకున్నట్టు అధికారులు వెల్లడించారు. థాయ్‌లాండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ఫుకెట్ దీవి నుంచి కోస్టా ఫార్చ్యూనా నౌక శుక్రవారం తిప్పి పంపారు. కరోనా వైరస్ బాధితులు లేకపోయినా నౌకను అక్కడ నుంచి వెనక్కుపంపినట్టు ఆపరేటర్ తెలిపారు. ఈ నౌకలో 64 మంది భారతీయులతో సహా 2,000 మంది ప్రస్తుతం ఈ నౌకలో ఉన్నారు.

ఈ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనావైరస్ మరణాలు చైనా తర్వాత ఇరాన్, ఇటలీలోనే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆ దేశ పౌరులను అనుమతించడానికి థాయ్‌లాండ్ అధికారులు నిరాకరించారని కోస్టా నౌక ఆపరేటర్ ట్విట్టర్‌లో తెలిపారు. ఫుకెట్ దీవి నుంచి శుక్రవారం వెనక్కు వచ్చిన కోస్టా ఫార్చ్యూన్.. శనివారం ఉత్తర మలేసియాలోని పెనాంగ్ నౌకాశ్రయంవైపు వస్తుండగా అధికారులు నౌకను రానివ్వకుండా అడ్డుకున్నాయని స్థానిక రాజకీయ నేత ఒకరు వ్యాఖ్యానించారు. తమ తీర ప్రాంతంల్లోని రేవుల్లోకి ప్రయాణికులతో వచ్చే నౌకల ప్రవేశాన్ని మలేసియా నిషేధించిందని ఆయన తెలిపారు.

మరోవైపు, మలేసియా అధికారులు నౌక ప్రవేశాన్ని అడ్డుకోవడంతో పక్క దేశం సింగపూర్‌వైపు వెళ్లిందని అన్నారు. వెస్టర్‌డామ్ నౌక విషయంలోనూ ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. రెండు వారాలపాటు సముద్రంలో ప్రయాణించిన ఈ నౌకను ఐదు దేశాలు తమ తీరంలోకి రాకుండా అడ్డుకోవడంతో చివరకు కాంబోడియా ప్రభుత్వం సౌహార్ద్ర హృదయంతో ఆ నౌకకు ఆశ్రయం ఇచ్చింది. చైనాలోని హుబే ప్రావిన్సుల్లో తొలిసారి వెలుగుచూసిన ప్రాణాంతక కరోనా వైరస్.. ప్రస్తుతం 95 దేశాలకు వ్యాపించింది.

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..