Breaking News
  • తెలుగు రాష్ట్రాలకు రూ.10లక్షలు విరాళం. మలికిపురం మండలం మట్టపర్రు సొంత గ్రామానికి తనవంతు సహాయంగా 5లక్షలు అందజేత.. తన కుటుంబ సభ్యుల ద్వారా తన గ్రామంలో రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున పంపిణీ.. కరోనా వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపు..
  • న్యూఢిల్లీ: కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో విజయం సాధించాలంటే ప్రజల సహకారం మరింత అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి.
  • కాశ్మీర్ లోయలో ఒక్కరోజులోనే 7 కొత్త కరోనా కేసుల నమోదు. శ్రీనగర్‌లో విదేశాలకు వెళ్లొచ్చిన ముగ్గురికి, మతపరమైన ప్రార్థనలకు హాజరైన నలుగురికి కరోనా పాజిటివ్. పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలు పెట్టిన అధికారులు.
  • విజయనగరం : టివి9 సమచారంతో స్పందించిన విశాఖ రీజియన్ డిఐజి కాళిదాసు రంగారావు ఏపి చెన్నై బోర్డర్ అధికారులతో పాటు చైన్నై కి చెందిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన డిఐజి విజయనగరం జిల్లాకు చెందిన వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విన్నపం బాధితులతో మాట్లాడిన రంగారావు.
  • సూర్యాపేట: మోతె మండలం రాఘవ పురం,నామవరం గ్రామాల్లో దళిత కాలనిలో ఇంటి ఇంటికి తిరిగి కూరగాయలు పంపిణీ చేసిన ఎంపీపీ మీ ఆశా శ్రీకాంత్ రెడ్డి. పంచిన ఎంపీపీ ఆశశ్రీకాంత్ రెడ్డి, పాల్గొన్న సర్పంచ్ లు,ఆశా వర్కర్లు, పోలీస్ సిబ్బంది.
  • కరోనా మహమ్మారి ప్రభావం వివిధ రంగాలపై తీవ్రంగా పడింది. దీని బారి నుంచి ప్రజలను కాపాడటానికి ఇప్పటికే హీరోల నుంచి సినీ నిర్మాతల నుంచి , దర్శకుల నుంచి విరాళాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ సంక్షోభం నుంచి సినిమా రంగాన్ని బయటపడేయటానికి సినీ ప్రముఖులు కంకణం కట్టుకున్నారు.
  • తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉన్నా కొంతమంది ఖాతరు చేయడం లేదు. అడ్డదారుల్లో రాష్ట్ర సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కంటైనర్‌లో వందల మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులు అడ్డుకున్నారు.
  • కరోనా పిశాచి అంతకంతకూ కోరలు చాస్తూ విలయతాండవం చేస్తోంది.. అగ్రరాజ్యం అమెరికా సైతం కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. అక్కడ ఒక్కరోజే 18 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.

ఇండియాతో కాళ్లబేరానికి వస్తున్న మలేషియా

Indian crude palm oil purchases from Malaysia, ఇండియాతో కాళ్లబేరానికి వస్తున్న మలేషియా

పొద్దున్నలేస్తే భారత్‌ను ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్న మలేషియాకు నరేంద్రమోదీ ప్రభుత్వం చుక్కలు చూపించింది… పామాయిల్‌తో మలేషియా మెడలు వంచేసింది… పామాయిల్‌ దిగుమతులను మలేషియా నుంచి తగ్గించి.. ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకోవడం మొదలు పెట్టింది భారత ప్రభుత్వం… మలేషియా నుంచి దిగుమతి చేసుకునే పామాయిల్‌పై భారీగా దిగుమతి పన్ను విధించింది.. వాస్తవానికి మలేషియా నుంచి ప్రతి సంవత్సరం 40 లక్షల టన్నుల పామాయిల్‌ భారత్‌కు వస్తుంది.. ఇదంతా ఆగిపోయేసరికి మలేషియా ప్రధానికి మైండ్‌ బ్లాక్‌ అయ్యింది.. ఇప్పుడా దేశానికి తత్వం బోధపడింది.. కాళ్లబేరానికి వచ్చింది.. వాణిజ్యపరంగా భారత్‌తో తలెత్తిన విభేదాలు త్వరలో సమసిపోతాయని మలేషియా పరిశ్రమల శాఖ మంత్రి థెరిసా కోక్‌ చెప్పడం ఈ కోవకే వస్తుంది..
మలేషియా పామాయిల్‌ ఉత్పత్తులపై భారత్‌ విధించిన నిషేధం తాత్కాలికమైనదని.. త్వరలో నిషేధాన్ని ఎత్తివేస్తుందన్న నమ్మకం తమకుందని థెరిసా కోక్‌ చెప్పుకొచ్చారు.. భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని మలేషియా ప్రధాని మహతీర్‌ విమర్శిస్తూ వచ్చారు.. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు నుంచి మొదలు పెడితే మొన్నీమధ్య సీఏసీ వరకు మహతీర్‌ ఏదో ఒకటి అనసాగారు.. అంతెందుకు కశ్మీర్‌ను ఆక్రమిత ప్రాంతమనే సాహసం చేశారు.. ఇలాగైతే లాభం లేదనుకున్న నరేంద్రమోదీ వాణిజ్యపరంగా మలేషియాను గట్టి దెబ్బకొట్టారు.. ప్రపంచంలోనే పామాయిల్‌ అతి పెద్ద దిగుమతిదారుగా ఉన్న భారత్‌… మలేషియా పామాయిల్‌ను కొనకూడదని నిర్ణయించింది.. మలేషియాకు బదులు ఇండోనేషియా నుంచి పామాయిల్‌ను దిగుమతి చేసుకోవాల్సిందిగా వ్యాపార సంస్థలకు చెప్పింది.. దీంతో మలేషియా తీవ్ర నష్టాల్లోపడింది.. ఇలాగైతే ఎలారా భగవంతుడా అని అనుకుని భారత్‌ను దువ్వే ప్రయత్నం మొదలుపెట్టింది.. అందులో భాగంగానే మలేషియా మంత్రి థెరిసా కోక్‌ సంధిని కాంక్షించే మాటన్నారు.. భారత్‌-మలేషియాల మధ్య సుదీర్ఘకాలంగా ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతున్నాయని.. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను రెండు దేశాలు అధిగమిస్తాయని భావిస్తున్నామని… పరస్పర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని అనుకుంటున్నామని కోక్‌ అన్నాడు. పామాయిల్‌ కొనుగోలుపై ఇండియా నిర్ణయం తాత్కాలికమేనని తాము అనుకుంటున్నామని తెలిపాడు..

Related Tags