Breaking News
  • హైదరాబాద్: రేపటి నుంచి అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు. బెంగళూరు మినహా కర్నాటక, మహారాష్ట్రకు బస్సులు . సర్వీసుల పునరుద్ధరణకు టీఎస్‌ ఆర్టీసీకి ప్రభుత్వ అనుమతి. తెలంగాణకు బస్సు సేవలను పునరుద్ధరించిన కర్నాటక, మహారాష్ట్ర. ముంబై, పుణె, గుల్బర్గా, నాగ్‌పూర్‌, రాయచూర్‌, బీదర్, నాందేడ్.. చంద్రాపూర్ సహా ముఖ్యమైన మార్గాల్లో మళ్లీ తిరగనున్న బస్సులు.
  • నేడు దేశ వ్యాప్తంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు. దేశ వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 1.51 లక్షల మంది విద్యార్థులు. ఉ.9గంటల నుంచి మ.12 గంటల వరకు పేపర్-1. మ.2:30 నుంచి సా.5:30 వరకు పేపర్‌-2. వచ్చే నెల 5న వెలువడనున్న జేఈఈ ఫలితాలు.
  • విజయవాడ: కృష్ణానదికి పెరుగుతున్న వరద ఉధృతి. ప్రస్తుత ఇన్ ఫ్లో 3,52,579 అవుట్ ఫ్లో 3,38,600 క్యూసెక్కులు . వరద ప్రభావిత మండలాల అధికారులను అప్రమత్తంచేసిన జిల్లాకలెక్టర్ ఇంతియాజ్ . ప్రకాశం బ్యారేజి ఎగువన గల పులిచింతల ప్రాజెక్ట్ నుండి వచ్చే వరద ప్రవాహం ప్రస్తుతం 460000 క్యూసెక్కులు.. వరద ప్రవాహం క్రమేణా పెరిగి 5.50 లక్షల నుంచి 6 లక్షల క్యూసెక్కులకు పెరిగి ప్రకాశం బ్యారేజికి చేరుకునే అవకాశం. ఈ రోజు 11.30 గంటల సమయానికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న అధికారులు.
  • ఉగ్రవాది అరెస్ట్‌ : పశ్చిమబెంగాల్‌: ముర్షిదాబాద్‌లో అల్‌ఖైదా ఉగ్రవాది సమీమ్‌ అన్సారీ అరెస్ట్‌ . ఉగ్రవాదిని అరెస్ట్‌ చేసిన స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌. ట్రాన్సిట్‌ రిమాండ్‌కు అనుమతిచ్చిన సీజేఎం కోర్టు. అన్సారీని ఢిల్లీలోని ఎన్‌ఐఏ కోర్టుకు తరలించనున్న ఎస్‌టీఎఫ్‌ .
  • తూ.గో: నేడు అంతర్వేది నూతన రథం నిర్మాణానికి పూజ. ఉ.11:15 గంటలకు ముహూర్తం.
  • తూర్పు బీహార్‌ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం. ఈశాన్య జార్ఖండ్‌, ఒడిశా మీదుగా మరో ఉపరితల ద్రోణి. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు. నేడు, రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు-వాతావరణశాఖ.

సెట్స్ లోనే కుప్పకూలి మరణించిన మలయాళీ నటుడు ప్రబీష్

Prabeesh Chakkalakka, సెట్స్ లోనే కుప్పకూలి మరణించిన మలయాళీ నటుడు ప్రబీష్

కేరళలో మలయాళ నటుడు ప్రబీష్ చక్కలక్కల్ ఓ మూవీ షూటింగ్ సందర్భంగా మంగళవారం సెట్స్ లోనే కుప్పకూలి మరణించాడు. ఆయన వయస్సు 44 ఏళ్ళు. కొచ్చిన్ కాలేజ్ పేరిట కొచ్చి లో ఓ యూట్యూబ్ ఛానల్ కోసం షూటింగ్ జరుగుతుండగా అకస్మాత్తుగా సెట్స్ లో ఆయన కుప్పకూలి మృతి చెందాడని,  ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్టు డాక్టర్లు వెల్లడించారని తెలిసింది. ప్రబీష్ పలు టీవీ షోలు, మూవీల్లో నటించాడని, డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా పని చేశాడని తెలుస్తోంది. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు.

 

 

Related Tags