బన్నీ తండ్రిగా అనుష్క విలన్..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో 19వ సినిమాను సెట్ చేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇటీవలే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసిన త్రివిక్రమ్.. ప్రధాన పాత్రలకు నటీనటులను ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే హీరోయిన్‌గా పూజా హెగ్డే, బన్నీ తల్లిగా టబును ఫైనల్ చేసిన ఈ దర్శకుడు, మరో ముఖ్య పాత్ర కోసం మలయాళ నటుడిని ఓకే చేశాడట.

మలయాళంలో మంచి క్రేజ్ ఉన్న సీనియర్ నటుడు జయరామ్‌ను ఈ చిత్రంలో బన్నీ తండ్రి పాత్ర కోసం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయనతో సంప్రదింపులు జరిపారని.. బన్నీ తండ్రిగా నటించేందుకు జయరామ్ ఒప్పుకున్నారని సమాచారం. ఇక గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తోన్న విషయం తెలిసిందే. కాగా అనుష్క నటించిన ‘భాగమతి’ సినిమాలో జయరామ్ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *