ఐ ఫోన్‌ నేనూ.. సేమ్‌ టూ సేమ్‌

Malala shared a pic of the dress she wore on the day of Apple event, ఐ ఫోన్‌ నేనూ.. సేమ్‌ టూ సేమ్‌

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ కొత్తగా వచ్చిన ఆపిల్‌ ఐఫోన్‌ 11పై చమత్కారంగా ట్వీట్‌ చేశారు. తాను ధరించిన డ్రెస్‌ డీజైన్‌లోనే ఆపిల్‌ కొత్త మోడల్స్‌ ఉన్నాయంటున్నారు మలాలా.. సెప్టెంబర్‌ 10న మలాలా వేసుకున్ననీలిరంగు డ్రెస్‌పై సెల్‌ఫోన్‌ కెమెరాల మాదిరిగా ఎంబ్రాయిడరీ వర్క్ చేయబడి ఉంది. అయితే, ఆపిల్‌ ఐఫోన్‌ అదే రోజు కొత్తగా విడుదల చేసిన ఆపిల్‌ ఐఫోన్‌ 11 ప్రో, ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్‌ రెండూ మూడు వెనుక కెమెరాలు అచ్చం మలాలా డ్రెస్‌పై ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్‌కు సరిగ్గా మ్యాచ్‌ అవుతున్నట్లుగా ఉండటంతో ఆమె ఈవిధంగా స్పందించారు. “ఆపిల్‌ ఐఫోన్‌ 11 లాంచింగ్‌ రోజునే నేను ఈ డీజైన్‌ డ్రెస్‌ వేసుకోవటం యాదృచ్చికమా’ అని ఆమె ట్వీట్‌ చేశారు. మలాలా ట్వీట్‌కు సోషల్‌ మీడియాలో సానుకూల స్పందన వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *