మక్కల్ నీదిమయ్యం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన కమల్

చెన్నై : కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 24 అంశాలకు మేనిఫెస్టోలో పెద్దపీట వేశారు. భారత ఎన్నికల ప్రక్రియలోకి తొలిసారిగా అడుగుపెడుతున్న మక్కల్ నీది మయ్యం ఎన్నికల హామీలను చిత్త శుద్ధితో అమలు చేసేందుకు కృషి చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ స్పష్టం చేశారు. పార్టీ నేత మహేంద్రన్ తో కలిసి ఇవాళ చెన్నైలో మేనిఫెస్టో విడుదల చేశారు. ఓటర్లను మభ్య పెట్టేందుకు […]

మక్కల్ నీదిమయ్యం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన కమల్
Follow us

| Edited By:

Updated on: Apr 08, 2019 | 12:44 PM

చెన్నై : కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 24 అంశాలకు మేనిఫెస్టోలో పెద్దపీట వేశారు. భారత ఎన్నికల ప్రక్రియలోకి తొలిసారిగా అడుగుపెడుతున్న మక్కల్ నీది మయ్యం ఎన్నికల హామీలను చిత్త శుద్ధితో అమలు చేసేందుకు కృషి చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ స్పష్టం చేశారు. పార్టీ నేత మహేంద్రన్ తో కలిసి ఇవాళ చెన్నైలో మేనిఫెస్టో విడుదల చేశారు. ఓటర్లను మభ్య పెట్టేందుకు అమలుకు నోచుకోని అంశాలను తమ మేనిఫెస్టోలో పొందుపరచలేదని మక్కల్ నీది మయ్యం ప్రకటించింది. ఈ ఐదు సంవత్సరాల్లో తాము చేయతగిన అంశాలను మాత్రమే మేనిఫెస్టోలో పొందుపరిచామని కమల్ హాసన్‌ స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైనవి.. ప్రజలు కోరుకున్న అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చాం అని అన్నారు.

తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన తమ మేనిఫెస్టో అందరికీ ఆమోదయోగ్యం కాగలదని కమల్ హాసన్ అన్నారు. పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేస్తూ.. స్కిల్ డెవలప్‌మెంట్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ప్రస్తుతం తమిళనాడులో వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఫుడ్ ప్రాసెసింగ్‌కు ప్రాధాన్యత ఇస్తామన్నారు. నీటి పారుదల, పంపిణీ అంశాలను కూడా మేనిఫెస్టోలో ప్రస్తావించారు. ప్రజలకు కనీస అవసరాలైన ఆస్పత్రులు, విద్యా సంస్థల అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇలా ప్రతిరంగాన్ని ప్రస్తావిస్తూ మొత్తం 24 అంశాలతో కూడిన మేనిఫెస్టోని మక్కల్ నీది మయ్యం విడుదల చేసింది.