సైన్యంపై సినిమాలు తీయాలంటే.. ఎన్‌ఓసీ తప్పనిసరి..

భారత్ సైన్యంపై సినిమాలు, డాక్యుమెంటరీలు, వెబ్ సిరీస్‌లు తీయాలంటే ఇక నుంచి తప్పనిసరిగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలని రక్షణ శాఖ పేర్కొంది.

సైన్యంపై సినిమాలు తీయాలంటే.. ఎన్‌ఓసీ తప్పనిసరి..
Follow us

|

Updated on: Aug 02, 2020 | 12:01 AM

NOC Must From Defence Ministry For Army Films: భారత్ సైన్యంపై సినిమాలు, డాక్యుమెంటరీలు, వెబ్ సిరీస్‌లు తీయాలంటే ఇక నుంచి తప్పనిసరిగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలని రక్షణ శాఖ పేర్కొంది. ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లలో ఆర్మీని తక్కువ చేసి చూపిస్తున్నారంటూ పలు ఫిర్యాదులు వచ్చాయి. అంతేకాకుండా కంటెంట్ పరిమితులు కూడా హద్దు దాటడంతో సైన్యాధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

సాయుధ దళాలపై ఏదైనా వెబ్ సిరీస్, సినిమా, డాక్యుమెంటరీ తెరకెక్కించే ముందుగా రక్షణ శాఖ నుంచి ఎన్‌ఓసీ తప్పనిసరిగా తీసుకోవాలని ఆర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ వివరాలను తెలియజేస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులకు, ప్రసార మంత్రిత్వ శాఖకు స్పష్టమైన లేఖ రాసింది. ఆర్మీ ప్రతిష్టను తక్కువ చేసి చూపించకుండా సెన్సార్ బోర్డు తగిన చర్యలు తీసుకోవాలని రక్షణ శాఖ తెలిపింది. అంతేకాక భారత సైన్యం మనోభావాలను దెబ్బ తీసేలా ఉండే సన్నివేశాలు తెరపై కనిపించడానికి వీల్లేదని స్పష్టం చేసింది.