Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

కంటతడి పెట్టించిన మేజర్ భార్య వీడ్కోలు తీరు

, కంటతడి పెట్టించిన మేజర్ భార్య వీడ్కోలు తీరు

న్యూఢిల్లీ: ఉగ్రవాదులతో జరిగిన పోరాటంలో వీరమరణం పొందిన ఆర్మీ మేజర్ శంకర్ డౌండియాల్‌కు అతని స్వస్థలం డెహ్రాడూన్‌లో అంత్యక్రియలు జరిగాయి. ఈ సందర్భంలో డౌండియాల్‌కు అతని భార్య నికిత వీడ్కోలు పలికారు. భర్తకు కడసారిగా ముద్దుపెట్టి ఐ లవ్ యూ అని చెప్పడం అందరినీ కంటతడి పెట్టించింది. భర్త పార్ధీవ దేహం పక్కనే కూర్చొని ఏడ్చింది. వీరికి గతేడాదే పెళ్లి జరిగింది. నికిత మాట్లాడుతూ దేశం కోసం తన భర్త ప్రాణ త్యాగం చేయడం తనకు గర్వంగా ఉందని అన్నారు.

పుల్వామా ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను ఏరివేసే క్రమంలో భారత జవాన్లు ఉగ్రవాదులతో పోరాడారు. ఈ పోరాటంలో నలుగురు భారత సైనికులు కన్నుమూశారు. అందులో మేజర్ శంకర్ డౌండియాల్ ఒకరు. డౌండియాల్ అంత్యక్రియలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.