పాక్ ఐఎస్ఐ కుట్ర భగ్నం.. ఆరుగురు ఉగ్రవాదుల అరెస్ట్

జమ్ముకశ్మీర్‌ను ఉగ్రవాద నీలి నీడలు ఇంకా వెన్నాడుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఓ వైపు ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు, భద్రతా దళాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నా.. మరోవైపు చాప కింద నీరులా పాక్ ఐఎస్ఐ అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలను తీవ్రతరం చేసేందుకు తన వంతు తాను యత్నిస్తోంది. తాజాగా ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు పాక్ గూఢచారులు.. విచారణలో సంచలన విషయాలను వెల్లడించారు. పాక్‌కు చెందిన ఐఎస్ఐ విభాగంలోని కల్నల్ స్థాయి అధికారితో తాము […]

పాక్ ఐఎస్ఐ కుట్ర భగ్నం.. ఆరుగురు ఉగ్రవాదుల అరెస్ట్
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2019 | 5:10 PM

జమ్ముకశ్మీర్‌ను ఉగ్రవాద నీలి నీడలు ఇంకా వెన్నాడుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఓ వైపు ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలు, భద్రతా దళాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నా.. మరోవైపు చాప కింద నీరులా పాక్ ఐఎస్ఐ అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలను తీవ్రతరం చేసేందుకు తన వంతు తాను యత్నిస్తోంది. తాజాగా ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు పాక్ గూఢచారులు.. విచారణలో సంచలన విషయాలను వెల్లడించారు. పాక్‌కు చెందిన ఐఎస్ఐ విభాగంలోని కల్నల్ స్థాయి అధికారితో తాము డైరెక్ట్ టచ్‌లో ఉన్నామని తెలిపారు. అతడి పేరు ఇఫ్తికర్‌తో ప్రారంభం అవుతుందని వారు అన్నారు. ఇక ఉగ్రవాద సంస్థ హిజ్బు ఉల్ ముజాహుదీన్‌తో కూడా తమకు సంబంధాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

అయితే ఆ గూఢచారుల వివరాలతో మరో నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి వద్ద నుంచి ఫొటోలను, వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. వారిని సద్దామ్ హుస్సేన్, మహ్మద్ సలీమ్, మహ్మద్ సఫీ, కఫ్దర్ అలీలుగా గుర్తించారు. వీరందరూ పాకిస్థాన్‌కు దగ్గరగా ఉన్న పర్వత ప్రాంతాలకు చెందిన వారిగా పోలీసులు వెల్లడించారు. ఈ ఉగ్రవాదులు భారత్‌తో భారీ కుట్రకు ప్రణాళిక రచించినట్లు వారు తెలిపారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నామని.. మిగిలిన వివరాలను వారి నుంచి రాబడుతామని పోలీసులు పేర్కొన్నారు.