Breaking News
  • భారత్‌-అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. కరోనాపై పోరులో భారత్‌ చేయాల్సిందంతా చేస్తోంది. సాయం చేయడానికి భారత్‌ ఎప్పుడూ ముందుంటుంది. కరోనా వైరస్‌ను కలిసికట్టుగా ఎదుర్కొంటాం-ప్రధాని మోదీ.
  • ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసలు. కరోనాపై యుద్ధంలో భారతీయుల కృషి అభినందనీయం. భారత ప్రధాని మోదీకి నా ధన్యవాదాలు-ట్రంప్‌ ట్వీట్‌.
  • కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో గుండెపోటుతో వ్యక్తి మృతి. ఇటీవల కరోనాతో చనిపోయిన వ్యక్తికి సోదరుడు కావడంతో.. స్థానికుల్లో పలు అనుమానాలు. మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలింపు. శాంపిల్స్‌ పరీక్షించే వరకు మృతదేహం ఇవ్వమంటున్న అధికారులు.
  • తెలంగాణలో డయల్‌ 100కు పెరుగుతున్న కాల్స్‌. లాక్‌డౌన్‌ తర్వాత డయల్‌ 100కు 13,34,330 కాల్స్‌. ఎమర్జెన్సీ కాల్స్‌-82,014. కోవిడ్‌ సస్పెక్ట్ కాల్స్‌- 2,710. లాక్‌డౌన్‌ కాల్స్‌-21,758. ఇన్‌ ఎఫెక్టివ్‌ కాల్స్‌-87,665. విచారణ కోసం చేసిన కాల్స్‌- 84,123. తగ్గిన చోరీలు, గృహ హింస, రోడ్డుప్రమాదాల కాల్స్‌.
  • తెలంగాణలో క్రైమ్‌ రేట్‌ తగ్గింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో క్రైమ్‌రేట్‌ భారీగా పడిపోయింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో క్రైమ్‌రేటు 56 శాతానికి పడిపోవడం ఊరటనిస్తోంది. లాక్‌డౌన్‌తో దొంగతనాలు పూర్తిగా తగ్గిపోయాయి.

Breaking: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి..

Major Accident In Uttar Pradesh, Breaking: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి..

Major Accident In Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఫిరోజాబాద్‌లోని నాగ్లాఖాంగార్‌లో బుధవారం రాత్రి ఆగి ఉన్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును వెనక నుంచి వచ్చి లారీ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 31 మందికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆగ్రా-లక్నో హైవేపై సుమారు రాత్రి 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ఢిల్లీ నుంచి బీహార్‌ వెళ్తుండగా ఈ దారుణం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Related Tags