పాతబస్తీలో మజ్లిస్‌ రాజ్యమే…ఏ ప్రభుత్వ అధికారి మా గల్లీలో అడుగు పెట్టలేరు.. మరో మజ్లిస్‌ ఎమ్మెల్యే మాటల తూాటాలు..

గ్రేటర్‌ ఎన్నికల్లో ఊహించని ఓ ఘటన.. ఎంఐఎం - టీఆర్ఎస్ మధ్య వివాదం. ఇద్దరూ ఇద్దరే. కలిసే ఉంటారు.. కలివిడిగా ఉంటారని బీజేపీ, కాంగ్రెస్ చెబుతుంటాయి. వాళ్లు చెప్పడం ఏంటి.. నిన్నమొన్నటి వరకూ అందరిదీ అదే ఫీలింగ్‌. కట్ చేస్తే.. ఇప్పుడు ఆ రెండు పార్టీల మధ్య వినిపిస్తున్న హైరేంజ్ కామెంట్స్‌ సెన్సేషన్ అయిపోతున్నాయి.

  • Sanjay Kasula
  • Publish Date - 11:52 am, Wed, 25 November 20
పాతబస్తీలో మజ్లిస్‌ రాజ్యమే...ఏ ప్రభుత్వ అధికారి మా గల్లీలో అడుగు పెట్టలేరు.. మరో మజ్లిస్‌ ఎమ్మెల్యే మాటల తూాటాలు..

MIM Mla Hot Comments :  గ్రేటర్ ఫైట్‌లో టీఆర్ఎస్ , ఎంఐఎం అభ్యర్ధుల మధ్య వార్‌ జరుగుతోంది. పాతబస్తీలో పట్టు నిలుపుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఎంఐఎం.. ఓట్ల కోసం అధికార పార్టీనే టార్గెట్ చేసింది. ఇంతకాలం మిత్రపక్షం అంటూ వ్వవహరించిన మజ్లిస్ నేతలు.. మొన్నటి మొన్న.. చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ మాటల తూటాలను పేల్చితే.. ఇప్పుడు తాజాగా మరో మజ్లీస్ ఎమ్మెల్యే అంతకంటే నాలుగు ఎక్కువ పేల్చాడు.

గ్రేటర్ పోలీసులను, ప్రభుత్వ అధికారులను పరోక్షంగా టార్గెట్ చేస్తూ ఎంఐఎం ఎమ్మెల్యే మోజం ఖాన్‌ హాట్‌ కామెంట్స్‌ చేశాడు. పాతబస్తీలో ఎప్పుడూ మజ్లిస్‌ రాజ్యమే నడుస్తుందంటూ తేల్చి చెప్పాడు. ఏ ప్రభుత్వ అధికారి పాతబస్తీ గల్లీలో అడుగు పెట్టలేరని అన్నారు. రోడ్లపై బైక్‌ రేసింగ్‌లు చేస్తున్నా ఏ ఒక్క పోలీస్‌ కూడా అడ్డుకోలేరని… ఎందుకంటే ఇక్కడ మజ్లిస్‌ బలంటూ బాంబులు పేల్చాడు. రాబోయే రోజుల్లో మజ్లిస్‌ ఇంకా బలపడితే పాతబస్తీ ప్రజలకు ఎలాంటి కష్టాలు ఉండవన్నారు మోజం ఖాన్‌.

పాతబస్తీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్ చేసిన కామెంట్స్ తెలిసినవే‌.. తమకు గద్దెనెక్కించడమూ తెలుసని.. దింపడమూ తెలుసంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయం ఎంఐఎం పార్టీ ఇంటి గుమస్తా లాంటిదన్నారు. ఈ మధ్యే కళ్లు తెరిచిన చిలకంటూ మంత్రి కేటీఆర్‌పైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు.