Breaking News
  • సామాజిక దూరాన్ని పాటించాలని ఎంత చెబుతున్నా షాపుల దగ్గర మాత్రం ఆ ఆదేశాలను ఎవరూ పాటించడం లేదు. షాపుల దగ్గర సోషల్‌ డిస్టెన్సింగ్‌ కనిపించడం లేదు. ధరల పట్టికలను పెట్టడం లేదు. విజయవాడలాంటి పెద్ద పెద్ద నగరాలలో కూడా ఇదే పరిస్థితి. అసలే విజయవాడలో నాలుగు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అయినా అక్కడ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు జనం.. పక్కపక్కనే నిలబడి సరకులు కొనుక్కుంటున్నారు.
  • ఢిల్లీకి వెళ్లి వచ్చినవారిపై ప్రత్యేక నిఘా పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. కాంటాక్టు కేసులు పెరగడంతో ఎవరెవరు ఢిల్లీకి వెళ్లి వచ్చారన్నది ఆరా తీస్తున్నారు అధికారులు. జిల్లాల వారిగా ప్రత్యేక బృందాలు ఆ పనిలోనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మందిని గుర్తించారు. వారందరిని క్వారంటైన్‌కు తరలించారు.
  • విజయవాడలోనే నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు రావడంతో మరింత అప్రమత్తమయ్యారు కృష్ణా జిల్లా అధికారులు. సిటీలో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఇక విజయవాడ నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో బంద్‌ పాటించాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు.
  • ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఎంత చితక బాదినా.. ఒళ్లు హూనం చేసినా.. వాళ్లు మాత్రం మారడం లేదు. మరికొందరికి ముప్పు కొని తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. బరి తెగించిన బద్మాష్‌గాళ్లు పోలీసులకే సవాల్‌ విసురుతున్నారు. ఏ పాపం ఎరుగని అమాయకులకి.. కరోనా మాయ రోగాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
  • నిరాడంబరంగా భద్రాద్రి శ్రీరామనవమి వేడుకలు. వేడుక‌లకు భక్తులకు అనుమతి లేదు.ప్రత్యక్ష ప్రసారం ద్వారా వేడుకలను టీవీల్లో వీక్షించాలని విజ్ఞప్తి. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించవద్దు. శ్రీరామనవమి వేడుకలపై ఉత్తర్వులు జారీచేసిన దేవాదాయ శాఖ.

హీరో విజయ్ ఇంటిపై రైడ్స్.. బ్యాక్‌డ్రాప్‌లో ఓ ట్వీట్.!

IT Raids On Kollywood Hero, హీరో విజయ్ ఇంటిపై రైడ్స్.. బ్యాక్‌డ్రాప్‌లో ఓ ట్వీట్.!

IT Raids On Kollywood Hero: గత మూడు రోజులుగా తమిళ స్టార్ హీరో విజయ్, బిగిల్ నిర్మాత ఇళ్లపై జరుగుతున్న ఐటీ రైడ్స్ ప్రస్తుతం కోలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశం అయ్యాయి. బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా దళపతి మాట్లాడినందుకే ఆయన్ని టార్గెట్ చేశారని కొందరు అంటుంటే.. రాజకీయ నాయకుల ఇళ్లను సోదా చేసే ధైర్యం లేక సెలబ్రిటీలపై దాడులు నిర్వహిస్తున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు. ఇక ఈ మొత్తం వ్యవహారంపై ఐటీ అధికారులు తాజాగా విస్తుపోయే విషయాలను బయటపెట్టారు. బిగిల్ నిర్మాత అక్రమార్జన వివరాలు వింటే షాక్‌కు గురి కాక తప్పదు.

హీరో విజయ్, బిగిల్ నిర్మాత కల్పాత్తి అఘోరా ఇళ్లపై ఐటీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించడానికి ఆయన కూతురు అర్చన చేసిన ట్వీటే కారణమని తెలుస్తోంది. నేషనల్ వైడ్‌గా బిగిల్ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాల్లో చోటు సంపాదించుకుందని ఆమె ట్విట్టర్ ద్వారా ఓ ట్వీట్ చేసింది. ఇక దీనితో ఐటీ అధికారులు కూపీ లాగడం మొదలుపెట్టారట.

బిగిల్ నిర్మాత, హీరో విజయ్ సమర్పించిన ఐటీ రిటర్న్స్ ఒకసారిగా క్షుణ్ణంగా పరిశీలించగా.. సినిమాకు విజయ్ తీసుకున్న రెమ్యునరేషన్.. నిర్మాత సమర్పిచిన రిటర్న్స్‌లో రెండూ వేరువేరుగా ఉండటం గుర్తించారట. దీనితో నిర్మాత కల్పాత్తి అఘోరా నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఆఫీస్‌పై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అటు అదే సమయంలో విజయ్ ఇంటిపై కూడా రైడ్స్ చేశారు.

‘మాస్టర్’ షూటింగ్‌ను మధ్యలోనే ఆపేసి విజయ్‌ను ఐటీ అధికారులు తీసుకెళ్లి సుదీర్ఘంగా విచారించారు. ఆస్తుల వివరాలు, నగదు ఇతరత్రా విషయాలపై లెక్కలు తీసుకున్నారు. అంతేకాకుండా ఏజీఎస్ ఆఫీస్, నిర్మాత ఇంట్లో సోదాలు నిర్వహించగా డబ్బు కట్టల బ్యాగ్‌లు కోట్ల విలువ చేసే వజ్రాలు, బంగారం, వెండి బయటపడ్డాయి. అటు 500 కోట్లు విలువ చేసే డాక్యూమెంట్స్ కూడా లభ్యమైనట్లు తెలుస్తోంది.

సుమారు 77 కోట్లు కల్పాత్తి అఘోరా సోదాల్లో బయటపడటంతో.. ఇండస్ట్రీ అంతటా ఇదే చర్చ కొనసాగుతోంది. ఫైనాన్షియర్ నుంచి నిర్మాతగా ఎదిగిన ఆయన మొత్తం ఆస్తిని అక్రమార్జనతో సంపాదించాడని కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. ఇక ఆయన ఇంట్లో దొరికిన పత్రాలు, బంగారం, నగదు అన్ని కూడా విలువ కట్టి చూడగా సుమారు 300 కోట్లు ఆదాయ పన్ను ఎగేసినట్లుగా అధికారులు అంచనాకు వచ్చారు.

మరోవైపు విజయ్ కూడా సుమారు 100 కోట్లు పన్ను ఎగవేసినట్లు సమాచారం అందుతోంది. అయితే తమ అభిమాన హీరో ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడంతో ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు. కానీ దీనికి మాత్రం ఇప్పుడు రాజకీయ రంగు కూడా పులుముకుంది. మరి మున్ముందు ఈ వ్యవహారం ఎటు వైపు వెళ్తుందో వేచి చూడాలి.

Related Tags