Breaking News
  • సామాజిక దూరాన్ని పాటించాలని ఎంత చెబుతున్నా షాపుల దగ్గర మాత్రం ఆ ఆదేశాలను ఎవరూ పాటించడం లేదు. షాపుల దగ్గర సోషల్‌ డిస్టెన్సింగ్‌ కనిపించడం లేదు. ధరల పట్టికలను పెట్టడం లేదు. విజయవాడలాంటి పెద్ద పెద్ద నగరాలలో కూడా ఇదే పరిస్థితి. అసలే విజయవాడలో నాలుగు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అయినా అక్కడ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు జనం.. పక్కపక్కనే నిలబడి సరకులు కొనుక్కుంటున్నారు.
  • ఢిల్లీకి వెళ్లి వచ్చినవారిపై ప్రత్యేక నిఘా పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. కాంటాక్టు కేసులు పెరగడంతో ఎవరెవరు ఢిల్లీకి వెళ్లి వచ్చారన్నది ఆరా తీస్తున్నారు అధికారులు. జిల్లాల వారిగా ప్రత్యేక బృందాలు ఆ పనిలోనే ఉన్నాయి. ఇప్పటికే చాలా మందిని గుర్తించారు. వారందరిని క్వారంటైన్‌కు తరలించారు.
  • విజయవాడలోనే నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు రావడంతో మరింత అప్రమత్తమయ్యారు కృష్ణా జిల్లా అధికారులు. సిటీలో ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారు. ఇక విజయవాడ నగరంలోని కృష్ణలంక ప్రాంతంలో బంద్‌ పాటించాలని జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ పిలుపునిచ్చారు.
  • ఎన్ని హెచ్చరికలు చేసినా.. ఎంత చితక బాదినా.. ఒళ్లు హూనం చేసినా.. వాళ్లు మాత్రం మారడం లేదు. మరికొందరికి ముప్పు కొని తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు. బరి తెగించిన బద్మాష్‌గాళ్లు పోలీసులకే సవాల్‌ విసురుతున్నారు. ఏ పాపం ఎరుగని అమాయకులకి.. కరోనా మాయ రోగాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
  • నిరాడంబరంగా భద్రాద్రి శ్రీరామనవమి వేడుకలు. వేడుక‌లకు భక్తులకు అనుమతి లేదు.ప్రత్యక్ష ప్రసారం ద్వారా వేడుకలను టీవీల్లో వీక్షించాలని విజ్ఞప్తి. బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహించవద్దు. శ్రీరామనవమి వేడుకలపై ఉత్తర్వులు జారీచేసిన దేవాదాయ శాఖ.

మహేశ్, విజయశాంతి..ఓ 30 ఏళ్ల ప్లాష్ బ్యాక్!

Mahesh Throwback Pic with Vijayashanti, మహేశ్, విజయశాంతి..ఓ 30 ఏళ్ల ప్లాష్ బ్యాక్!

సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందనా హీరోయిన్. అలనాటి తార విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. కొన్నేళ్లుగా వెండితెరకు దూరమై..పాలిటిక్స్‌లో ఉన్న ఆమె ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవలే మళ్లీ మేకప్‌ వేసుకున్న ఆమె తాజా షెడ్యూల్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతిని ఉద్దేశించి మహేశ్‌బాబు ట్వీట్‌ చేశారు.

కృష్ణ హీరోగా విజయశాంతి హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అందులో ‘కొడుకు దిద్దిన కాపురం’ కూడా ఒకటి. ఇందులో మహేశ్‌బాబు కూడా నటించారు. ఆ చిత్ర సెట్స్‌లో విజయశాంతితో దిగిన ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకుంటూ.. ‘1989లో ఇక్కడే మా జర్నీ ప్రారంభమైంది. అదే కొడుకు దిద్దిన కాపురం. మళ్లీ 30ఏళ్ల తర్వాత విజయశాంతిగారితో పనిచేస్తున్నా. జీవితం అనేది నిజంగా చక్రంలాంటిది” అని పేర్కొన్నారు.

శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేశ్‌ ఇందులో ఆర్మీ అధికారి అజయ్‌కృష్ణగా కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబులు నిర్మిస్తున్నారు.

Related Tags