Breaking News
  • రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. ఇళ్ల నుంచి బయటకు వస్తే తప్పకుండా మాస్కులు ధరించాలని ఆదేశించింది. చాలా మందిలో కరోనా సోకినా లక్షణాలు ఉండటంలేదని అధ్యయనంలో వెల్లడి కావడంతో మాస్కుల వినియోగాన్ని తప్పనిసరి చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
  • ముంబై దాదార్‌లోని శుష్రుషా ఆస్పత్రి నర్సులందరినీ క్వారంటైన్‌కు తరలింపు. ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్ రావడంతో చర్యలు. కొత్తగా రోగులెవరినీ చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేసిన అధికారులు. ఇప్పటికే ఉన్న రోగులను 48 గంటల్లో డిశ్చార్జి చేయాలని ఆదేశాలు. క్వారంటైన్ చేసిన నర్సులందరికీ కరోనా టెస్టులు చేయాల్సిందిగా ఆదేశం.
  • కరోనా నుంచి పూర్తిగా కొలుకోక ముందే కొత్తగూడెం డిఎస్పీ డిశ్చార్జి.. అదే పేరుతో ఉన్న మరోవ్యక్తికి నెగిటివ్ రావటం తో డిఎస్పీ డిశ్చార్జి.. రిపోర్టులో డిఎస్పీకి పాజిటివ్ అని తేలటంతో మళ్ళీ వెనక్కి రప్పిస్తున్న వైద్యులు.. నిన్న ఇంటికి వెళ్లినా డిఎస్పీ క్వారంటైన్ లొనే ఉన్నారు..
  • కరోనాతో బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ కుట్ర. కుట్రను భగ్నం చేసిన బిహార్ పోలీసులు. నేపాల్ సరిహద్దుల ద్వారా కరోనా పాజిటివ్ ఉగ్రవాదులను భారత్‌కు పంపే అవకాశం. తద్వారా వైరస్ విస్తృతి చేయాలన్నది పాక్ కుట్రగా అనుమానం.
  • కరోనా ని ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సాయమందించిన మై హోం గ్రూప్. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి 3 కోట్ల రూపాయల చెక్ ని అందించిన మై హోం ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరక్టర్ జూపల్లి రంజిత్ రావు.

Prabhas: మహేష్ హ్యాండ్ ఇచ్చారు.. ప్రభాస్ ఓకే చెప్తారా..!

మహేష్ తదుపరి చిత్రం గురించి గత కొన్ని రోజులుగా వస్తోన్న వార్తలు ఆయన అభిమానులను కంగారు పెడుతున్నాయి. అసలు మహేష్ విషయంలో ఏం జరుగుతోంది..? ఈ రూమర్లపై మహేష్ టీమ్ గానీ, వంశీ టీమ్‌గానీ ఎందుకు స్పందించలేదు..?
Mahesh director narratted story for Prabhas, Prabhas: మహేష్ హ్యాండ్ ఇచ్చారు.. ప్రభాస్ ఓకే చెప్తారా..!

మహేష్ తదుపరి చిత్రం గురించి గత కొన్ని రోజులుగా వస్తోన్న వార్తలు ఆయన అభిమానులను కంగారు పెడుతున్నాయి. అసలు మహేష్ విషయంలో ఏం జరుగుతోంది..? ఈ రూమర్లపై మహేష్ టీమ్ గానీ, వంశీ టీమ్‌గానీ ఎందుకు స్పందించలేదు..? మహర్షి కాంబోలో రావాల్సిన మరో ప్రాజెక్ట్‌ ఆగిపోవడానికి గల అసలు కారణాలేంటి..? మరికొన్ని రోజుల్లో సెట్స్ మీదకు వెళ్తుందన్న ఈ మూవీకి బ్రేక్ ఏంటి..? తన క్లోజ్‌ ఫ్రెండ్‌కు, మహేష్‌కు మధ్య ఏం జరిగింది..? ఇలాంటి ప్రశ్నలు అందరిలోనూ మెదలుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ రూమర్లపై ఇంకా స్పష్టత రాకముందే వంశీ పైడిపల్లి గురించిన మరోవార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే మహేష్‌తో ప్రాజెక్ట్ ఆగిపోవడంతో.. వంశీ పైడిపల్లి మిగిలిన హీరోలను కలుస్తున్నారట. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ను కలిసిన వంశీ ఇప్పటికే కథను చెప్పినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రభాస్ ఇంకా తన అభిప్రాయాన్ని చెప్పనట్లు సమాచారం. మరి వంశీకి ప్రభాస్‌కు ఓకే చెప్తారో..? లేదో..? తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. కాగా ప్రభాస్ నటించిన మున్నా చిత్రం ద్వారా వంశీ పైడిపల్లి దర్శకుడిగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ మూవీలో పూజా హెగ్డే నటిస్తుండగా.. యువీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ మూవీని.. అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

Read This Story Also: మహేష్ మూవీ ఆగిపోవడానికి నాగ్ డైరక్టర్ కారణమా..!

Related Tags