మహేష్‌తో పోటీపడుతున్న కొడుకు

లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన టాలీవుడ్ ప్రముఖులు సోష్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు అందికంటే ముందున్నారు.

మహేష్‌తో పోటీపడుతున్న కొడుకు
Follow us

|

Updated on: May 23, 2020 | 2:49 PM

లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియలో  యాక్టీవ్‌గా ఉంటున్నారు. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు అందరికంటే ముందున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు సితార, గౌతమ్‌తో ఆటలాడుకొంటూ చిన్నపిల్లాడిలా మారిపోయారు. క్వారంటైన్ లైఫ్‌కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తున్నారు.

తాజాగా మ‌హేశ్.. తన కొడుకు గౌత‌మ్‌తో హైట్ విష‌యంలో పోటీ ప‌డుతున్న‌ట్లు ఉండే వీడియోను పోస్ట్ చేశారు. తన కుమారుడి ముందు నిలబడి తమలో ఎవరు పొడవుగా ఉన్నారో చూసుకున్నాడు. ‘హైట్‌ చెక్‌!! హి ఈజ్‌ టాల్, లాక్‌డౌన్‌లో కొంచెం ఫన్నీగా..’ అంటూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టేశారు.

కొడుకు గౌతమ్‌ హైట్‌నీ తన హైట్‌తో కంపేర్ చేసుకున్నప్పటి వీడియో మహేష్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. హైట్‌ చెక్‌ చేసుకున్నాం.. అతడే ఎక్కువ ఎత్తు.. అంటూ మహేష్‌ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చుకున్నారు. కానీ.. వీడియో చెప్తున్న నిజమేంటంటే.. మహేష్‌బాబే హైట్ ఎక్కువ.

రీసెంట్‌గా త్రోబ్యాక్ వీడియోస్ అంటూ తన ఫ్యామిలీ డైరీలోంచి రోజుకో జ్ఞాపకాన్ని బైటపెడుతున్నారు నమ్రత.

View this post on Instagram

Height check!! He’s tall♥️♥️ #LockdownShenanigans

A post shared by Mahesh Babu (@urstrulymahesh) on