కరోనా ఎఫెక్ట్‌: అప్పటివరకు ‘నో’ షూటింగ్‌ అంటోన్న మహేష్‌..!

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా షూటింగ్‌లు చేసుకునేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనుమతిని ఇచ్చాయి.

కరోనా ఎఫెక్ట్‌: అప్పటివరకు 'నో' షూటింగ్‌ అంటోన్న మహేష్‌..!
Follow us

| Edited By:

Updated on: Jun 21, 2020 | 5:29 PM

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా షూటింగ్‌లు చేసుకునేందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనుమతిని ఇచ్చాయి. అయితే రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో సినీ ప్రముఖులు షూటింగ్‌లపై పెద్ద ఆసక్తిని చూపడం లేదు. ఈ క్రమంలో కొంతమంది హీరోలు ఇప్పట్లో సెట్స్‌ మీదకు వెళ్లకూడదని అనుకుంటున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. అందులో ముఖ్యంగా సూపర్‌స్టార్ మహేష్ బాబు పేరు వినిపిస్తోంది.

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు సర్కారు వారి పాటలో నటించాల్సి ఉండగా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో డిసెంబర్ వరకు ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొననని ఆయన నిర్మాతలకు చెప్పేశారట. ఆ లోపు కావాలనుకుంటే తన పాత్రతో సంబంధం లేని టాకీ పార్ట్‌ను పూర్తి చేసుకోమని వారికి సూచించారట. దీంతో దర్శకనిర్మాతలు ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు చిరంజీవి కూడా సెట్స్‌ మీదకు వెళ్లేందుకు సిద్దంగా లేరని సమాచారం. పని ముఖ్యం.. కానీ ప్రాణం అంతకంటే ముఖ్యమని ఇటీవల ఓ వీడియోలో సైతం చెప్పిన మెగాస్టార్.. కొరటాలను మరికొన్ని రోజులు ఆగమని చెప్పారట. ఇక ఇదే దారిలోనే వెంకటేష్, నాని తదితర హీరోలు ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో రిస్క్ చేయకపోవడమే మంచిదని వారందరూ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడే కాదు బాలీవుడ్‌లోనూ పలువురు స్టార్ హీరోలు షూటింగ్‌లకు రెడీగా లేనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాను షూటింగ్‌లకు రానని, తన కుమార్తెను కూడా పంపనని ప్రముఖ నటుడు శక్తి కపూర్ స్టేట్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Read This Story Also: ఆరోపణలు చేసే ముందు ఆలోచించండి: బీజేపీ నేతలపై ఈటెల మండిపాటు

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!