సినిమాల్లోకి మహేష్ అల్లుడు ఎంట్రీ ఎప్పుడంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు బావ, ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ నెల 10న.. అశోక్ గల్లాకు సంబంధించిన మూవీ డీటైల్స్‌ని.. రామానాయుడు స్టూడియోలో.. వెల్లడించనుంది చిత్ర బ‌ృందం. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. కాగా.. అశోక్ గల్లా సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. భలే మంచి రోజు, శమంతక మణి, దేవదాస్ చిత్రాలతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా… కమర్షియల్‌గా […]

సినిమాల్లోకి మహేష్ అల్లుడు ఎంట్రీ ఎప్పుడంటే..?
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 07, 2019 | 3:24 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు బావ, ఎంపీ గల్లా జయదేవ్ తనయుడు గల్లా అశోక్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ నెల 10న.. అశోక్ గల్లాకు సంబంధించిన మూవీ డీటైల్స్‌ని.. రామానాయుడు స్టూడియోలో.. వెల్లడించనుంది చిత్ర బ‌ృందం. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. కాగా.. అశోక్ గల్లా సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.

భలే మంచి రోజు, శమంతక మణి, దేవదాస్ చిత్రాలతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా… కమర్షియల్‌గా కూడా విజయాలను దక్కించుకున్న దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్‌ టైన్‌మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా.. రిచర్డ్ ప్రసాద్ సినిమాటో గ్రఫీ అందిస్తున్నారు. నరేష్, సత్య, అర్చనా సౌందర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.