మహేశ్ జోడీగా సాయి పల్లవి..?

‘ఎఫ్2’తో ఈ ఏడాది పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి, ఇప్పుడు సూపర్‌స్టార్ మహేశ్ బాబును డైరక్ట్ చేసే అవకాశం సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈ మూవీలో హీరోయిన్‌గా సాయి పల్లవిని సంప్రదించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పని మీద ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి చెన్నైకి వెళ్లినట్లు సమాచారం. పనిలో పనిగా సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌కు […]

మహేశ్ జోడీగా సాయి పల్లవి..?
Follow us

| Edited By:

Updated on: Mar 04, 2019 | 1:20 PM

‘ఎఫ్2’తో ఈ ఏడాది పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న అనిల్ రావిపూడి, ఇప్పుడు సూపర్‌స్టార్ మహేశ్ బాబును డైరక్ట్ చేసే అవకాశం సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రానికి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. కాగా ఈ మూవీలో హీరోయిన్‌గా సాయి పల్లవిని సంప్రదించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పని మీద ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి చెన్నైకి వెళ్లినట్లు సమాచారం. పనిలో పనిగా సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌కు స్టోరీ చెప్పి రానున్నాడని తెలుస్తోంది.

కాగా ఫిదాతో టాలీవుడ్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఆ తరువాత ఎమ్‌సీఏతో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఆపైన ఆమె నటించిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు. దీంతో టాలీవుడ్‌లో మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది ఈ బ్యూటీ. ఈ నేపథ్యంలో మహేశ్ సినిమాలో ఆఫర్ రావడం ఒక రకంగా కెరీర్‌కు బూస్టప్ వచ్చినట్లే. మరి కథ నచ్చితే తప్ప సినిమాకు ఓకే చెప్పని సాయి పల్లవిని, అనిల్ రావిపూడి మెప్పిస్తారో లేదో చూడాలి.