‘ఆచార్య’ను మహేష్ వదులుకున్నాడా..? క్లారిటీ ఇచ్చిన చిరు..!

సూపర్‌స్టార్ మహేష్‌ బాబు తనకు కొడుకులాంటోడని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 'ఆచార్య' సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

'ఆచార్య'ను మహేష్ వదులుకున్నాడా..? క్లారిటీ ఇచ్చిన చిరు..!
Follow us

| Edited By:

Updated on: Apr 05, 2020 | 9:30 PM

సూపర్‌స్టార్ మహేష్‌ బాబు తనకు కొడుకులాంటోడని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ‘ఆచార్య’ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ఓ కీలక పాత్ర కోసం మహేష్‌ను తీసుకోబోతున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందన్నంతలోనే.. మళ్లీ ఆ పాత్ర కోసం చెర్రీని ఫైనల్ చేసినట్లు ఫిలింనగర్‌లో టాక్ నడిచింది. ఈ క్రమంలో ఆ పాత్రకు చెర్రీ ఫిక్స్‌ అయినట్లు ఖరారు చేశారు మెగాస్టార్ చిరంజీవి. అంతేకాదు మహేష్ బాబు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆచార్యలో కీలక పాత్ర గురించి విన్న తరువాత.. ఆ పాత్రకు చెర్రీనే కరెక్ట్‌గా సరిపోతాడని తాను, సురేఖ ఇద్దరం భావించామని చిరంజీవి తెలిపారు. ఈ పాత్ర కోసం తాము మహేష్‌ను సంప్రదించలేదని.. ఈ పుకార్లు ఎలా వచ్చాయో కూడా తమకు అర్థం కాలేదని ఆయన చెప్పారు. ఈ పాత్ర గురించి తాము స్క్రిప్ట్ విన్నప్పటి నుంచే చెర్రీని ఫిక్స్‌ చేసుకున్నామని తెలిపారు. అయితే చెర్రీ ‘ఆర్ఆర్ఆర్‌’లో బిజీగా ఉండటం వలన.. ఈ మూవీకి ఇంకా డేట్లను ఇవ్వలేదని పేర్కొన్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం చెర్రీ డేట్లు ఇస్తారో..! లేదో..! కూడా తెలీదని ఆయన అన్నారు. ఈ విషయంలో కొరటాల, రాజమౌళి మాట్లాడుకుంటారని చిరు చెప్పుకొచ్చారు. అలాగే ఈ పాత్ర చిన్నదేం కాదని.. కానీ సినిమాకు చాలా అవసరమైన పాత్ర అని చిరు తెలిపారు. ఇక మహేష్‌ తనకు తనయుడులాంటోడని.. అతడితో కలిసి నటించే అవకాశం వస్తే కచ్చితంగా చేస్తానని చిరు పేర్కొనడం విశేషం. ఇక ఈ సందర్భంగా మూవీ టైటిల్‌ను రివీల్ చేయడం తన తప్పేనని మెగాస్టార్ ఒప్పుకోవడం గమనర్హం.

కాగా సామాజిక కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’లో చిరు సరసన కాజల్ అగర్వాల్ రెండోసారి జత కట్టబోతోంది. సోనూసూద్‌ మరో కీలక పాత్రలో నటించబోతుండగా.. రెజీనా ప్రత్యేక గీతంలో మెరవనుంది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Read This Story Also: అవేం మోదీ, జగన్ డబ్బులు కావు.. అంబటి రాంబాబు ఫైర్

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు