‘మహేష్‌’ సినిమాకి మూడక్షరాలే ఎందుకు..?

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ సినిమా విజయం అందుకున్న సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఈ సినిమా టీం, కుటుంబ సభ్యులు ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. అయితే.. మహర్షి తరువాత ఇదివరకే మహేష్ చాలా సినిమాలకు సైన్ చేసిన విషయం తెలిసిందే. అందులో ఒకరే అనిల్ రావిపూడి. ప్రస్తుతం అనిల్ రావిపూడి అయితే స్క్రిప్ట్‌తో రెడీగా ఉన్నారు. ఈ సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కానీ.. మహేష్‌‌బాబుకి మూడక్షరాల టైటిల్ సెంటిమెంట్ ఉంది. ‘మురారి’ .. ‘పోకిరి’ .. ‘ఒక్కడు’ .. ‘దూకుడు’ .. ఇలా మూడు అక్షరాలతో వచ్చిన ఆయన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. తాజాగా మూడు అక్షరాలతో వచ్చిన ‘మహర్షి’ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. సో అందుకని మూడు అక్షరాలతో వచ్చే మంచి టైటిల్ కోసం కసరత్తు చేస్తున్నారట డైరెక్టర్ అనిల్ రావిపూడి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *