గాంధీజీని హత్య చేసింది గాడ్సే కాదా ? ఇదెక్కడి వింత ?

గాంధీ మహాత్ముడు ‘ యాక్సిడెంటల్ కారణాలవల్ల ‘ మరణించారంటూ ఒడిశాలోని ఓ ప్రభుత్వ పుస్తకంలో ప్రచురించడం పెను వివాదానికి దారి తీసింది. ఈ పొరబాటును వెంటనే సరిదిద్దాలని, సీఎం నవీన్ పట్నాయక్ క్షమాపణ చెప్పాలని రాజకీయ నేతలు, యాక్టివిస్టులు డిమాండ్ చేశారు. గాంధీజీ 150 వ జయంతి సందర్భంగా ప్రచురితమైన బుక్ లెట్ లో.. 1948 జనవరి 30 న హఠాత్తుగా సంభవించిన పరిణామాల కారణంగా ఢిల్లీలోని బిర్లా హౌస్ లో ఆయన మరణించారని పేర్కొన్నారు. దీంతో […]

  • Pardhasaradhi Peri
  • Publish Date - 6:33 pm, Fri, 15 November 19

గాంధీ మహాత్ముడు ‘ యాక్సిడెంటల్ కారణాలవల్ల ‘ మరణించారంటూ ఒడిశాలోని ఓ ప్రభుత్వ పుస్తకంలో ప్రచురించడం పెను వివాదానికి దారి తీసింది. ఈ పొరబాటును వెంటనే సరిదిద్దాలని, సీఎం నవీన్ పట్నాయక్ క్షమాపణ చెప్పాలని రాజకీయ నేతలు, యాక్టివిస్టులు డిమాండ్ చేశారు. గాంధీజీ 150 వ జయంతి సందర్భంగా ప్రచురితమైన బుక్ లెట్ లో.. 1948 జనవరి 30 న హఠాత్తుగా సంభవించిన పరిణామాల కారణంగా ఢిల్లీలోని బిర్లా హౌస్ లో ఆయన మరణించారని పేర్కొన్నారు. దీంతో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. రాష్ట్ర స్కూలు, మాస్ ఎడ్యుకేషన్ శాఖ ప్రచురించిన పుస్తకమిది.. ఈ వైనంపై కాంగ్రెస్ తో బాటు పాలక బీజేడీ సభ్యులు కూడా రాష్ట్ర అసెంబ్లీలో తీవ్రంగా మండిపడ్డారు. సీఎం నవీన్ పట్నాయక్ తక్షణమే అపాలజీ చెప్పాలని సీఎల్ఫీ నేత నరసింహ మిశ్రా డిమాండ్ చేశారు. ఆయనను ఈ దేశం క్షమించదన్నారు. ‘ అంటే గాంధీజీని గాడ్సే చంపలేదన్నది ఈ ప్రభుత్వ అభిప్రాయమా అని ప్రశ్నించారు. గాడ్సేని ఉరి తీసిన విషయం ఈ సర్కార్ కి తెలియదా అని కూడా నిలదీశారు. బీజేపీ, బీజేడీ రెండు పార్టీలూ ఒకే నాణేనికి ఉన్న బొరుసుల్లాంటివని ఆయన విమర్శించారు. కాగా- ఈ వివాదాస్పద అంశాన్ని వెంటనే తొలగించాలని నవీన్ పట్నాయక్ ఆదేశించారు.