‘రీల్’ మహర్షితో ‘రియల్’ మహర్షులు..ప్రత్యేక ముఖాముఖి

హైదరాబాద్‌: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు రీసెంట్‌గా నటించిన మూవీ ‘మహర్షి’. మహేశ్‌బాబు 25వ మూవీగా వచ్చిన ఈ చిత్రం రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. వీకెండ్ వ్యవసాయం అంటూ ఓ వినూత్న కాన్సెప్ట్‌ను తెరకెక్కించిన ఈ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లికు, హీరో మహేశ్‌బాబు తెలుగు సినిమా ప్రేక్షకులు సలాం కొడుతున్నారు. సినిమా విజయానందంలో ఉన్న వీరు  రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సినిమాలో మల్టీ మిలియన్ డాలర్ల టర్నోవర్ ఉన్న కంపెనీని వదిలేసి వచ్చిన రిషి(మహేశ్).. భారత్‌కు వచ్చి వ్యవసాయం చేశారు. నిజ జీవితంలో కూడా ఇలాంటి ‘రిషి’లు ఎందరో ఉన్నారు. వారిలో కొందరు మహేశ్‌తో ప్రత్యేక ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ పంట చేతికి రాక తన బంధువులు ఆత్మహత్య చేసుకోవడం గురించి వివరించారు. ఆమె మాటలు విన్న మహేశ్‌.. ‘మీరు మాకెంతో స్పూర్తిదాయకం. నేను ఇప్పటివరకు కలిసిన గొప్ప వ్యక్తుల్లో మీరొకరు. హ్యాట్సాఫ్‌ టు యూ. మీరున్నారు కాబట్టే మేమున్నాం’ అన్నారు. వీరిలో కొంతమంది వారు పండించిన ఆర్గానిక్ బియ్యాన్ని..పండ్లను మహేశ్‌కు అందించారు.  వీటితో పాటు పలు భావోద్వేగకరమైన మూమెంట్స్ ఈ ఇంటర్వ్యూ చూస్తున్నంతసేపు మనల్ని హంట్ చేస్తూనే ఉంటాయి. రియల్ మహర్షులు జీవిత అనుభవాలు తెలియాలంటే మీరూ ఈ ఇంటర్య్వూ చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *