Breaking News
  • స్పీకర్‌ తీరు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉంది. సభలో స్పీకర్‌ తీసుకునే నిర్ణయాలు సీఎం తీసుకుంటున్నారు. స్పీకర్‌ సస్పెండ్‌ చేయకుండానే మార్షల్స్‌ బయటకు ఎలా తీసుకెళ్తారు. -మీడియా పాయింట్‌లో చినరాజప్ప. సీఎం కూడా రౌడీలా వ్యవహరిస్తున్నారు-చినరాజప్ప. సీఎం ఆదేశాలతోనే మార్షల్స్‌ నన్ను బయటకు తీసుకొచ్చారు. సస్పెండ్‌ చేయకుండా నన్ను బయటకు తీసుకురావడం.. సభా నిబంధనలకు విరుద్ధం-మీడియా పాయింట్‌లో చినరాజప్ప.
  • ప్రకాశం: ఒంగోలులో అపస్మారకస్థితిలో పడిఉన్న మహిళ. ఘటనా స్థలంలో మహిళ లోదుస్తులు, కండోమ్స్‌ గుర్తింపు. మహిళపై అత్యాచారం జరిగినట్టు అనుమానం. పోలీసుల సహకారంతో మహిళను ఆస్పత్రికి తరలింపు. మహిళ నోట్లో బియ్యం కుక్కి హత్యచేసేందుకు దుండగుల యత్నం. మహిళ ఊపిరితిత్తుల్లో బియ్యం గింజలు గుర్తించిన వైద్యులు. మహిళ పరిస్థితి విషమం.
  • శాసన మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ. 3 గంటలపాటు చర్చకు అనుమతించిన డిప్యూటీ చైర్మన్‌. పార్టీల వారీగా సమయం కేటాయించిన డిప్యూటీ చైర్మన్‌. టీడీపీకి 84 నిమిషాలు, వైసీపీకి 27 నిమిషాలు.. పీడీఎఫ్‌ 15 నిమిషాలు, బీజేపీకి 6 నిమిషాల సమయం కేటాయింపు.
  • శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన పవన్‌కల్యాణ్‌. పవన్‌కల్యాణ్‌ వెంట నాదెండ్ల మనోహర్‌. రేపు మధ్యాహ్నం వరకు ఢిల్లీలో ఉండనున్న పవన్‌కల్యాణ్‌. పలువురు బీజేపీ పెద్దలను కలవనున్న పవన్‌కల్యాణ్.
  • తెలంగాణ భవన్‌ నుంచి ఎన్నికల సరళీని సమీక్షిస్తున్న మంత్రి తలసాని. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, జిల్లాల కోఆర్డినేటర్లు.

రూ. 30వేలకు ఆశపడ్డ తల్లి..9 ఏళ్ల కూతురికి పెళ్లి

Maharashtra child marriage, రూ. 30వేలకు ఆశపడ్డ తల్లి..9 ఏళ్ల కూతురికి పెళ్లి

మన దేశంలో అనాదిగా వస్తున్న దురాచారాల్లో బాల్య వివాహం కూడా ఒకటి. 18 ఏళ్లు నిండాకే అమ్మాయిలకే పెళ్లిల్లు చేయాలని చట్టం ఎంత మొత్తుకుంటున్నా కొన్ని చోట్ల మాత్రం పట్టించుకునే వారు లేకుండా పోతున్నారు. దీంతో చిన్న వయస్సులోనే వారు చెప్పుకోలేన బాధలను అనుభవించాల్సి వస్తోంది. ఓ వైపు ఆరోగ్యం బాగా లేక, మరో వైపు సమాజం విధించే కట్టుబాట్లను ఎదిరించలేక, విధికి తలొగ్గి బతుకు పోరాటంలో అలాగే ముందుకు సాగుతూ జీవితం వెల్లదీస్తున్నారు. దీంతో కొంత మంది నడివయస్సు వచ్చే సరికి తీవ్రమైన అనారోగ్యాలు, వ్యాధుల బారిన పడి అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇంకా కొందరు ఎంతగానో మానసిక క్షభను, ఆవేదనను అనుభవిస్తున్నారు. అయితే, ఒకప్పుడు దీని ప్రభావం మన దగ్గర బాగా ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అంతగా లేదని చెప్పాలి. ఎక్కడో ఓ చోట మాత్రం ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి.
తాజాగా మహారాష్ట్రలో జరుగుతున్న బాల్య వివాహన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఔరంగాబాద్‌ జిల్లా మజల్‌గావ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అషమతి గోలాప్‌ అనే మహిళ తన 9 ఏళ్ల కూతురిని వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేసింది. అషమతి స్నేహితురాలు ఉర్మిళా యాదవ్‌ 20 ఏళ్ల కొడుకుతో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. బదులుగా వరుడి తరపు నుంచి రూ. 30 వేల నగదు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మరో నాలుగు రోజుల్లో ముహూర్తం కూడా పెట్టించారు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా విషయం బయటకు తెలిసి పోలీసుల వరకూ వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు..పెళ్లిని ఆపించేశారు. బాల్య వివాహం చేసేందుకు సిద్దపడిన బాధ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.