‘మహా’ పోలీసుల్లో కరోనా కలవరం.. ఇవాళ 311 మందికి పాజిటివ్

మహారాష్ట్రలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడంలేదు. దేశంలోనే అత్యధిక కేసులతో మొదటిస్థానంలో కొనసాగుతున్న మహారాష్ట్రలో కరోనాతో పోరాడుతున్న ఫ్రంట్ వారియర్స్ సైతం వైరస్ కాటుకు గురవుతున్నారు.

‘మహా’ పోలీసుల్లో కరోనా కలవరం.. ఇవాళ 311 మందికి పాజిటివ్
Follow us

|

Updated on: Sep 14, 2020 | 4:43 PM

మహారాష్ట్రలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడంలేదు. దేశంలోనే అత్యధిక కేసులతో మొదటిస్థానంలో కొనసాగుతున్న మహారాష్ట్రలో కరోనాతో పోరాడుతున్న ఫ్రంట్ వారియర్స్ సైతం వైరస్ కాటుకు గురవుతున్నారు. కొవిడ్ బారిన పడుతున్న పోలీసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ప్రతిరోజు వందల సంఖ్యలో కొత్తగా కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 311 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా బారినపడిన పోలీసుల సంఖ్య 19,385కు చేరుకుంది. మరోవైపు, కరోనా సోకిన పోలీసుల్లో 15,521 మందికి కోలుకుని క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. ఇందులో 3,670 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కాగా గత 24 గంటల్లో కరోనాను జయించలేక ఐదుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్ కారణంగా చనిపోయిన పోలీసుల సంఖ్య 194కి చేరింది. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పోలీసులు అత్యధిక సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడుతున్నారు. వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. ఇక, మహారాష్ట్రలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 లక్షలు దాటగా 29,115 మంది కరోనా కాటుకు బలయ్యారు.