మీ ఎమ్మెల్యేలు అందరూ టచ్‌లోనే ఉన్నారు.. బీజేపీ మంత్రి కామెంట్స్!

రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. కాంగ్రెస్, ఎన్సీపీలకు చెందిన 50 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, త్వరలోనే వారు బీజేపీలో చేరతారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి, బీజేపీ నేత గిరీష్ మహాజన్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఐటీ దాడులతో బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు ముమ్మర ప్రయత్నాలు […]

మీ ఎమ్మెల్యేలు అందరూ టచ్‌లోనే ఉన్నారు.. బీజేపీ మంత్రి కామెంట్స్!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 29, 2019 | 4:19 PM

రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. కాంగ్రెస్, ఎన్సీపీలకు చెందిన 50 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, త్వరలోనే వారు బీజేపీలో చేరతారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి, బీజేపీ నేత గిరీష్ మహాజన్ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు.

తమ పార్టీ ఎమ్మెల్యేలను ఐటీ దాడులతో బీజేపీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరాద్ పవార్ విచారం వ్యక్తం చేశారు. ఇంతలోనే ఎన్సీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని బాంబు పేల్చారు సదరు బీజేపీ నేత. ‘‘కాంగ్రెస్, ఎన్సీపీలకు చెందిన ఓ 50 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్‌లో ఉన్నారు. ఎన్సీపికి చెందిన సీనియర్ నేత చిత్ర వాగ్.. బీజేపీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు. ఆయన త్వరలోనే ఎన్సీపీని వీడతారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మరికొద్ది రోజులు ఎదురు చూడండి’’ అని మహాజన్ అన్నారు.

ముంబై ఎన్సీపీ అధినేత సచిన్ అహిర్ ఇప్పటికే పార్టీని వీడి శివసేనలో చేరారు. 2014 ఎన్నికల్లో బిజెపి మొత్తం 288 లో 122 సీట్లు గెలుచుకోగా, శివసేన 63. కాంగ్రెస్, ఎన్‌సిపి వరుసగా 42, 41 సీట్లు సాధించాయి.