కూరల కొట్టు బంపర్ ఆఫర్.. వీలైతే కొనండి.. లేకపోతే ఉచితంగా తీసుకోండి..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థలన్ని అతలాకుతలమయ్యాయి. అయితే.. మ‌హారాష్ట్ర‌లోని ఔరంగాబాద్‌లోని

కూరల కొట్టు బంపర్ ఆఫర్.. వీలైతే కొనండి.. లేకపోతే ఉచితంగా తీసుకోండి..
Follow us

| Edited By:

Updated on: May 28, 2020 | 5:52 PM

Vegetables for free to poor: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థలన్ని అతలాకుతలమయ్యాయి. అయితే.. మ‌హారాష్ట్ర‌లోని ఔరంగాబాద్‌లోని ఆ కూర‌గాయ‌ల దుకాణం మీదుగా వెళుతున్న‌వారంతా అక్క‌డున్న బోర్డు చూసి తెగ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఆ బోర్డుపై… ‘వీలైతే కొనండి, లేకపోతే ఉచితంగా తీసుకోండి’… అని రాసివుంది. దీనిని చూసిన‌వారంతా ఆ దుకాణం య‌జ‌మానిని తెగ అభినందిస్తున్నారు.

వివరాల్లోకెళితే.. ఈ దుకాణాన్ని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే రాహుల్ (గ్రాడ్యుయేట్) నిర్వహిస్తున్నాడు. లాక్‌డౌన్ కార‌ణంగా అత‌ను ప‌నిచేసే ప్రైవేట్ సంస్థ జీతం ఇవ్వక‌పోవ‌డంతో అత‌ను తన తండ్రితో పాటు కూరగాయలు అమ్మాల‌ని నిర్ణయించుకున్నాడు. మొద‌ట అతను కూరగాయలను మార్కెట్ ధరలకే విక్రయించేవాడు. త‌రువాత పేదలకు కూర‌గాయ‌లు ఉచితంగా ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాడు.

మరోవైపు.. రాహుల్ మాట్లాడుతూ ఇటీవ‌ల ఒక వృద్ధురాలు త‌న దుకాణం ద‌గ్గ‌ర‌కు వచ్చి ఐదు రూపాయ‌ల‌కు కూర‌గాయ‌లు ఇవ్వాల‌ని కోరింద‌ని, అయితే ఐదు రూపాయ‌ల‌కు ఏమీ రావని చెప్పి, ఆమెకు ఉచితంగానే కూర‌గాయ‌లు ఇచ్చాన‌ని తెలిపారు. ఆ త‌రువాత నుంచి అర్హులైన‌వారికి కూర‌గాయ‌లు ఉచితంగా ఇస్తున్నాన‌ని తెలిపారు.