అయోధ్యపై.. ఫేస్‌బుక్‌లో అభ్యంతకరమైన పోస్ట్: వ్యక్తి అరెస్ట్..!

అసలే కొన్ని క్షణాల్లో ఏం జరగనుందా అని దేశమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తుంటే.. మరోపక్క ఆకతీయిలు.. అల్లరి చేష్టలు వీడటం లేదు. ఇప్పటికే.. ఫేస్‌బుక్‌లో అయోధ్య కేసుపై ఎలాంటి అభ్యంతరకరమైన పోస్టులు పెట్టకూడదని.. స్ట్రిక్ట్‌ రూల్స్ వచ్చాయి. అయినా.. కానీ ఓ వ్యక్తి పోస్ట్‌ పెట్టి అరెస్ట్‌ పాలయ్యాడు. సున్నితమైన అంశం కాబట్టి ఇప్పటికే పోలీసులు అప్రమత్తంగా ఉంటూ.. సోషల్ మీడియాలో పుకార్లు జరగకుండా నిఘా పెంచారు. అయితే.. మహారాష్ట్రలోని ధూలెలోని ఓల్డ్ ఆగ్రా రోడ్‌లో నివాసం […]

అయోధ్యపై.. ఫేస్‌బుక్‌లో అభ్యంతకరమైన పోస్ట్: వ్యక్తి అరెస్ట్..!
Follow us

| Edited By:

Updated on: Nov 09, 2019 | 2:24 PM

అసలే కొన్ని క్షణాల్లో ఏం జరగనుందా అని దేశమంతా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తుంటే.. మరోపక్క ఆకతీయిలు.. అల్లరి చేష్టలు వీడటం లేదు. ఇప్పటికే.. ఫేస్‌బుక్‌లో అయోధ్య కేసుపై ఎలాంటి అభ్యంతరకరమైన పోస్టులు పెట్టకూడదని.. స్ట్రిక్ట్‌ రూల్స్ వచ్చాయి. అయినా.. కానీ ఓ వ్యక్తి పోస్ట్‌ పెట్టి అరెస్ట్‌ పాలయ్యాడు.

సున్నితమైన అంశం కాబట్టి ఇప్పటికే పోలీసులు అప్రమత్తంగా ఉంటూ.. సోషల్ మీడియాలో పుకార్లు జరగకుండా నిఘా పెంచారు. అయితే.. మహారాష్ట్రలోని ధూలెలోని ఓల్డ్ ఆగ్రా రోడ్‌లో నివాసం ఉండే 56ఏళ్ల సంజయ్ రామేశ్వర్ శర్మ అనే వ్యక్తి.. ఫేస్‌బుక్‌లో అయోధ్య అంశంపై అభ్యంతరకరమైన పోస్ట్ పెట్టిన దుమారం రేపాడు. ఇది కాస్తా పోలీసుల ధృష్టికి రావడంతో.. వారు అతన్ని అరెస్ట్ చేశారు. సంజయ్ రామేశ్వర్‌ శర్మపై 153(1)బీ, ఐసీపీ 188 కింద కేసులు పెట్టారు. అంతేకాకుండా.. గతంలో కూడా రెండు కేసుల్లో కూడా సంజయ్ శర్మ అరెస్ట్‌ అయ్యాడు.