మావోయిస్టుల కుట్ర భగ్నం

మహారాష్ట్రలో మావోయిస్టుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రాష్ట్రంలోని గొండియా జిల్లాలోని సలేకస తహసిల్‌లోని ఓ గ్రామంలో పోలీసులు కూంబింగ్ చేపడుతుండగా.. ఓ భారీ ఐఈడీ పేలుడు పదార్ధాన్ని..

మావోయిస్టుల కుట్ర భగ్నం
Follow us

| Edited By:

Updated on: Aug 12, 2020 | 11:07 PM

మహారాష్ట్రలో మావోయిస్టుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రాష్ట్రంలోని గొండియా జిల్లాలోని సలేకస తహసిల్‌లోని ఓ గ్రామంలో పోలీసులు కూంబింగ్ చేపడుతుండగా.. ఓ భారీ ఐఈడీ పేలుడు పదార్ధాన్ని గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. బాంబ్‌ స్క్వాడ్‌ సహాయంతో ఆ ఐఈడీని నిర్వీర్యం చేశారు. అంతేకాదు.. అదే ప్రాంతంలో పెద్ద ఎత్తున ఐఈడీ పేలుడు పదార్ధాలతో పాటు.. డిటోనేటర్లు, వైర్లు, బ్యాటరీని స్వాధీనం చేసుకున్నారు. వీటిని నక్సలైట్లే పాతిపెట్టారని పోలీసులు తెలిపారు. సలేకస తహసిల్‌ ప్రాంతంలో గొండియా పోలీసులు నిత్యం తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని నక్సలైట్లు దాడికి స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు.

Read More :

ఆస్పత్రి మెడికల్‌ షాపులో అగ్నిప్రమాదం.. కరోనా రోగుల తరలింపు

శివసేన గూటికి స్వతంత్ర ఎమ్మెల్యే