Breaking News
  • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
  • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
  • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
  • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
  • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
  • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

సర్వేలన్నీ ఆపార్టీవైపే.. రెండు రాష్ట్రాల్లో అధికారం చేపట్టేది ఎవరంటే?

సోమవారం జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలపై అన్ని ఎగ్జిట్‌ పోల్స్‌లోనూ బీజేపీ విజయం సాధించబోతున్నట్టుగా ఫలితాలు వచ్చాయి. మహారాష్ట్ర, హర్యానాల్లో కమలం పార్టీనే మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోబోతున్నట్టుగా పేర్కొన్నాయి.

టీవీ9 మరాఠీ ఎగ్జిట్‌పోల్‌:

మహారాష్ట్రలో మొత్తం 288 స్ధానాలుండగా వీటిలో బీజేపీకి 197, కాంగ్రెస్ 75 స్ధానాలు, ఇతరులు 16 స్ధానాల్లో విజయం సాధించే వీలుందని తేలింది.

టీవీ9 భారత్‌వర్ష్‌ ఎగ్జిట్‌పోల్‌:

మహారాష్ట్రలో బీజేపీ-197, కాంగ్రెస్‌-75, ఇతరులు-16, హర్యానాలో మొత్తం 90 స్ధానాలుండగా బీజేపీకి 47 స్ధానాలు, కాంగ్రెస్ 23 స్ధానాలు, ఇతరులు 20 స్ధానాల్లో గెలిచే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇండియా టుడే-యాక్సిస్‌ ఎగ్జిట్‌పోల్‌:

మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలుండగా బీజేపీ-శివసేన కూటమిదే అధికారమని ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. పూర్తి వివరాల ప్రకారం బీజేపీకి 109-124, శివసేనకు 57-70, కాంగ్రెస్‌కు 32-40,ఎన్సీపీకి 40-50, ఇతరులు 22-32 స్ధానాల్లో విజయం సాధించబోతున్నట్టుగా ఇండియా టుడే పేర్కొంది.

సీఎన్‌ఎన్‌-న్యూస్‌ 18 ఎగ్జిట్‌పోల్‌: 

మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమికి 243 స్ధానాలు, కాంగ్రెస్‌ 41, ఇతరులు 04 స్ధానాల్లో విజయం సాధించబోతున్నారని వెల్లడించింది.

టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌పోల్‌:

టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌పోల్‌ సర్వే ప్రకారం మహారాష్ట్రలో బీజేపీ కూటమికి -180 స్ధానాలు, కాంగ్రెస్‌-81, ఇతరులు-23 స్ధానాల్లో జయకేతనం ఎగురవేస్తారని అంచనా వేస్తుంది. అదేవిధంగా  హర్యానాలో మొత్తం 90 స్థానాలుండగా వీటిలో బీజేపీ -71, కాంగ్రెస్‌ -11, ఇతరులు-8 విజయం సాధిస్తారని అంచనా వేసింది.

ఏబీపీ-సీవోటర్‌ ఎగ్జిట్‌పోల్:

ఏబీపీ-సీవోటర్‌ ఎగ్జిట్‌పోల్స్ సర్వే కూడా దాదాపు అదే విషయాన్ని వెల్లడిచేస్తూ మహారాష్ట్రలో బీజేపీ-204, కాంగ్రెస్‌-69, ఇతరులు-15 స్ధానాల్లో గెలుపొందబోతున్నారని పేర్కొంది.

అన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగానే కనిపిస్తున్నాయి. అదే సమయంలో బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడిన శివసేన పోటీ చేసిన దాదాపు స్ధానాల్లో విజయాన్ని పొందబోతున్నట్టుగా సర్వేలు వెల్లడించాయి. మహారాష్ట్రలో మరోసారి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించనుండటంతో బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో హర్యానాలో కూడా మరోసారి బీజేపీ అధికారంలోకి రానున్నట్టుగా సర్వేలు వెల్లడించాయి.