అది చట్టబధ్ధమైన ప్రభుత్వం కాదు.. బీజేపీపై కాంగ్రెస్ ధ్వజం

మహారాష్ట్రలో సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన తీరును సవాలు చేస్తూ సేన, ఎన్సీపీలతో బాటు సుప్రీంకోర్టుకెక్కిన కాంగ్రెస్ పార్టీ.. బీజేపీది చట్టబధ్ధమైన ప్రభుత్వం కాదని, ఆ ప్రభుత్వానికి మెజారిటీ లేదని పేర్కొంది. ఫ్లోర్ టెస్ట్ ద్వారానే ఇది నిరూపితమవుతుందని ఈ పార్టీ నేతలు రణదీప్ సింగ్ సుర్జేవాలా, పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యానించారు. . మహారాష్ట్ర పరిణామాలపై సుప్రీంకోర్టు ఇఛ్చిన ఆదేశాల అనంతరం మీడియాతో మాట్లాడిన వారు.. ఆదివారం అయినప్పటికీ.. తమ పిటిషన్ […]

అది చట్టబధ్ధమైన ప్రభుత్వం కాదు.. బీజేపీపై కాంగ్రెస్ ధ్వజం
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 25, 2019 | 1:38 PM

మహారాష్ట్రలో సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన తీరును సవాలు చేస్తూ సేన, ఎన్సీపీలతో బాటు సుప్రీంకోర్టుకెక్కిన కాంగ్రెస్ పార్టీ.. బీజేపీది చట్టబధ్ధమైన ప్రభుత్వం కాదని, ఆ ప్రభుత్వానికి మెజారిటీ లేదని పేర్కొంది. ఫ్లోర్ టెస్ట్ ద్వారానే ఇది నిరూపితమవుతుందని ఈ పార్టీ నేతలు రణదీప్ సింగ్ సుర్జేవాలా, పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యానించారు. . మహారాష్ట్ర పరిణామాలపై సుప్రీంకోర్టు ఇఛ్చిన ఆదేశాల అనంతరం మీడియాతో మాట్లాడిన వారు.. ఆదివారం అయినప్పటికీ.. తమ పిటిషన్ ను కోర్టు విచారించినందుకు కోర్టుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. రేపు ఉదయం మళ్ళీ 10.30 గంటలకు విచారణ జరుగుతుందని, ఫడ్నవీస్ ప్రభుత్వం చట్ట విరుధ్ధమని తేలుతుందని జోస్యం చెప్పారు. ఎమ్మెల్యేల బేరసారాలు జరగకముందే అసెంబ్లీలో బలపరీక్ష జరగాలని వారు డిమాండ్ చేశారు. .’ ఈ ప్రభుత్వానికి మెజారిటీ లేదు.. బల పరీక్ష నిర్వహిస్తే మాకే మెజారిటీ ఉందని రుజువవుతుంది ‘ అని సుర్జేవాలా అన్నారు.

తనకు మెజారిటీ ఉందని చెప్పుకుంటూ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాసిన లేఖను, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆయనకు గవర్నర్ రాసిన లేఖను రేపు ఉదయం పదిన్నర గంటల లోగా సమర్పించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.అలాగే ఫడ్నవీస్, అజిత్ పవార్ తో బాటు కేంద్రానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

మరోవైపు-సేన సీనియర్ నేత సంజయ్ రౌత్.. సంచలన ప్రకటన చేశారు. గవర్నర్ తమను ఇప్పుడు ఆహ్వానించినా తాము తమ మెజారిటీని నిరూపించుకుంటామని ఆయన చెప్పారు. ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారాన్ని ఆయన ‘ యాక్సిడెంటల్ ‘ కార్యక్రమంగా అభివర్ణించారు. నిన్నటిరోజు ఈ దేశానికి, ప్రజాస్వామ్యానికి చీకటి రోజన్నారు. దేశంలో ఇలా జరగడం ఇదే మొదటిసారని, రాష్ట్రపతి భవన్, రాజ్ భవన్ దుర్వినియోగమవుతున్నాయని సంజయ్ రౌత్ ఆవేదన వ్యక్తం చేశారు. 49 మంది సేన ఎమ్మెల్యేలు మా వెంటే ఉన్నారు అని కూడా తెలిపారు.