బ్రేకింగ్ న్యూస్: మహారాష్ట్రలో జులై 31 వరకు లాక్‌డౌన్..

ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఈ వైరస్‌కి వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్..

బ్రేకింగ్ న్యూస్: మహారాష్ట్రలో జులై 31 వరకు లాక్‌డౌన్..
Follow us

| Edited By:

Updated on: Jun 29, 2020 | 5:00 PM

ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకీ కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఈ వైరస్‌కి వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు జరుగుతున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ బాట పడుతున్నాయి. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో లాక్‌డౌన్ విధిస్తున్నాయి. అలాగే పలు కీలక ఆంక్షలు పెడుతున్నాయి. ఇక తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం సైతం జులై 31వ తేదీ వరకూ లాక్‌డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంక్షల విధింపుపై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కలెక్టర్లకు పూర్తి అధికారాలు కట్టబెట్టింది. ఆయా ప్రాంతాల్లోని కరోనా తీవ్రతను బట్టి ఆ జిల్లా అధికారులు ఆంక్షలు విధించాలని ఆదేశాలు జారీ చేసింది మహారాష్ట్ర సర్కార్. అత్యవసరం కాని కార్యకలాపాలను కట్టడి చేయాలని స్పష్టం చేసింది.

ఇక మహారాష్ట్రలోనూ కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో అత్యధికంగా మహాలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో 1,64,626 కేసులు నమోదవ్వగా, దేశంలోనే అత్యధికంగా 7,429 మంది మరణించారు. ఇక ప్రస్తుతం 70,622 కేసులు యాక్టీవ్‌గా ఉండగా, 86,575 మంది రికవరీ అయ్యారు.

కాగా ఇక దేశ వ్యాప్తంగా సోమవారం నాడు కొత్తగా 19,459 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,48,318కి చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2,10,120 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 3,21,723 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి దేశ వ్యాప్తంగా 16,475 మంది మరణించారు.

Read More: 

వకీల్ సాబ్ నుంచి న్యూ స్టిల్ లీక్.. నల్లకోటులో పవన్..

బ్రేకింగ్: వైసీపీ నేత దారుణ హత్య.. సైనెడ్ పూసిన కత్తితో..

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. తత్కాల్ బుకింగ్ ప్రారంభం..

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..