మహారాష్ట్రలో నవంబర్‌ 30 వరకు లాక్‌డౌన్‌

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి అదుపులోకి రావడం లేదు. రోజు రోజుకు కొవిడ్ వైరస్‌ కేసుల పెరుగుదల కొనసాగుతుండటంతో లాక్‌డౌన్‌ను నవంబర్‌ 30 వరకూ పొడిగించినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 రోజువారీ కేసులు పడిపోయినా..

మహారాష్ట్రలో నవంబర్‌ 30 వరకు లాక్‌డౌన్‌
Follow us

|

Updated on: Oct 29, 2020 | 7:56 PM

Extended The Lockdown : మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి అదుపులోకి రావడం లేదు. రోజు రోజుకు కొవిడ్ వైరస్‌ కేసుల పెరుగుదల కొనసాగుతుండటంతో లాక్‌డౌన్‌ను నవంబర్‌ 30 వరకూ పొడిగించినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా కోవిడ్‌-19 రోజువారీ కేసులు పడిపోయినా దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో మాత్రం పరిస్థితి మరోలా ఉంటోంది.

మహారాష్ట్రలో ప్రస్తుతం 1,30,286 యాక్టివ్‌ కేసులున్నాయి. అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా ఈనెల ఆరంభంలో మహారాష్ట్ర ప్రభుత్వం 50 శాతం కెపాసిటీ మించకుండా హోటళ్లు, ఫుడ్‌కోర్టులు, రెస్టారెంట్లు, బార్లను తెరిచేందుకు అనుమతించింది.

అయితే స్కూళ్లు, కాలేజీలు విద్యాసంస్ధలను మాత్రం అనుమతించలేదు. అత్యవసర సేవల్లో విధులు నిర్వహించే ఉద్యోగుల కోసం ప్రత్యేక సబర్బన్‌ రైళ్ల రాకపోకలను అధికారులు అనుమతించారు. మరోవైపు సాధారణ ప్రజలకు లోకల్‌ రైళ్ల పునరుద్ధరణ కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పశ్చిమ, కేంద్ర రైల్వేలకు లేఖ రాసింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో దశలవారీగా సబర్బన్‌ రైళ్ల పునరుద్ధరించాలని లేఖలో ప్రభుత్వం రైల్వేలకు సూచించింది.

ఇక దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ఎన్ని నియంత్రణ చర్యలు తీసుకున్నా… పరిస్థితి మారడం లేదు. దీనికి తోడు కరోనా నిబంధనలు పాటించడంలో అక్కడి ప్రజలు నిర్లక్ష్య వహిస్తున్నారని ప్రభుత్వ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.