సీఎం సీటుపై ‘శివసేన’ పేచీ.. బీజేపీ వ్యూహమేంటి..?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం దిశగా బీజేపీ-శివసేన కూటమి పయనిస్తోంది. ఎగ్జిట్ పోల్స్‌కు దగ్గరగానే ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఇక ఈ ఎన్నికలలో శివసేనతో కలిసి పోటీ చేసినప్పటికీ.. తామే సొంతంగా అధికారంలోకి వస్తామని ముందు బీజేపీ అంచనావేసింది. కానీ ఆ పార్టీ ఇప్పుడు వంద స్థానాలకు పైగా మెజార్టీలో ఉంది. ఇక శివసేన 70కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రౌండ్లు ముగిసే కొద్దీ బీజేపీ ఆధిక్యం తగ్గుతుండగా.. శివసేన ఆధిక్యం పెరుగుతోంది. ఈ […]

సీఎం సీటుపై 'శివసేన' పేచీ.. బీజేపీ వ్యూహమేంటి..?
Follow us

| Edited By:

Updated on: Oct 24, 2019 | 8:30 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయం దిశగా బీజేపీ-శివసేన కూటమి పయనిస్తోంది. ఎగ్జిట్ పోల్స్‌కు దగ్గరగానే ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. ఇక ఈ ఎన్నికలలో శివసేనతో కలిసి పోటీ చేసినప్పటికీ.. తామే సొంతంగా అధికారంలోకి వస్తామని ముందు బీజేపీ అంచనావేసింది. కానీ ఆ పార్టీ ఇప్పుడు వంద స్థానాలకు పైగా మెజార్టీలో ఉంది. ఇక శివసేన 70కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రౌండ్లు ముగిసే కొద్దీ బీజేపీ ఆధిక్యం తగ్గుతుండగా.. శివసేన ఆధిక్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్‌రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి శివసేనకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. అలాగే పదవులు కూడా సగం, సగం పంచుకోవాలని సంజయ్ కామెంట్లు చేశారు. దీంతో ఇంకా అధికారంలోకి రాకుండానే ఈ కూటమి మధ్య సీఎం లొల్లి మొదలైంది. మరోవైపు చెరో రెండున్నర్రేళ్లు అధికారంలో ఉండాలన్న ప్రతిపాదన కూడా ఇరు పార్టీల మధ్య నడుస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే 2014 ఎన్నికల్లోనూ బీజేపీ, శివసేనలు వేర్వేరుగా పోటీ చేయగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం బీజేపీకి శివసేన మద్దతు ఇచ్చింది. అప్పుడు కూడా సీఎం పదవిని చెరో రెండున్నర్ర సంవత్సరాలు పంచుకోవాలని శివసేన డిమాండ్ తీసుకొచ్చింది. కానీ ఆ సమయంలో బీజేపీకే ఎక్కువ మెజార్టీ ఉండటంతో వారు ఆ ప్రతిపాదనకు ఒప్పుకోకుండా.. బీజేపీ తరఫున దేవేంద్ర ఫడ్నవీస్‌నే ఐదు సంవత్సరాలు సీఎం పదవిలో కూర్చోబెట్టారు. ఇక ఇప్పుడు పరిస్థితుల్లోనూ శివసేనకు సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ ఏ మాత్రం సముఖంగా లేదన్నది సమాచారం. ఈ నేపథ్యంలో శివసేన డిమాండ్‌కు బీజేపీ తగ్గకపోతే.. వారు బయటికి వచ్చి కాంగ్రెస్- ఎన్సీపీ కూటమికి మద్దతిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక మరోవైపు ఇప్పటివరకు ఫలితాల్లో కాంగ్రెస్‌ నాలుగో స్థానానికి పరిమితమైంది. ఇలాంటి సమయంలో ఒకవేళ శివసేన తమకు మద్దతు ఇవ్వకపోతే.. ఎన్పీపీతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదన్నది విశ్లేషకుల మాట. మొత్తానికి మహారాష్ట్రలో ఎవరు గెలుస్తారు..? ఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది..? మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరు..? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం త్వరలోనే తెలుస్తుంది.

వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..