మహారాష్ట్ర కౌన్సిల్ ఎన్నికలు, 4 సీట్లలో పాలక శివసేన కూటమి విజయం, బీజేపీ కి ఒకేఒక్కసీటు !

మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క స్థానంలో గెలిచింది. మొత్తం 5 సీట్లకు గాను నాలుగు స్థానాల్లో పాలక శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్  కూటమి విజయం సాధించింది. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం దిశగా సాగుతున్నారు.

మహారాష్ట్ర కౌన్సిల్ ఎన్నికలు, 4 సీట్లలో పాలక శివసేన కూటమి విజయం, బీజేపీ కి ఒకేఒక్కసీటు !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 04, 2020 | 1:53 PM

మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క స్థానంలో గెలిచింది. మొత్తం 5 సీట్లకు గాను నాలుగు స్థానాల్లో పాలక శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్  కూటమి విజయం సాధించింది. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం దిశగా సాగుతున్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత పాటిల్ సహా పలువురు పార్టీ నేతలు ముఖ్యంగా పూణే నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ అది ఫలించలేదు. ఇక్కడ కూటమి అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఫలితాలు తాము ఆశించినట్టు లేవని దేవేంద్ర ఫడ్నవీస్ అంగీకరించారు. మేం ఎక్కువ సీట్లు వస్తాయని భావించాం, కానీ ఒక్క సీటే గెలిచాం. మూడు పార్టీల మహా వికాస్ అఘాడీ శక్తిని అంచనా వేయలేకపోయాం అని ఆయన వ్యాఖ్యానించారు.

ఔరంగాబాద్, పూణే పట్టభద్రుల నియోజకవర్గాలను ఎన్సీపీ గెలుచుకుంది. ఏడాది  కాల మహావికాస్ అఘాడీ ప్రభుత్వానికి, విపక్ష బీజేపీకి మధ్య ఇది తొలి ఎన్నిక ఫలితం. ఈ ద్వైవార్షిక ఎన్నికల్లో 12 లక్షలమందికి పైగా గ్రాడ్యుయేట్లు, టీచర్లు పాల్గొన్నారు. కౌన్సిల్ లో మొత్తం 78 సీట్లు ఉన్నాయి.

తనకు మంచి పట్టు ఉన్నపట్టభద్రుల  నియోజకవర్గాలను బీజేపీ కోల్పోవడం విశేషం. ముఖ్యంగా నాగపూర్   విషయానికి వస్తే లోగడ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, దేవేంద్ర ఫడ్నవీస్ తండ్రి గంగాధరరావు ఫడ్నవీస్ ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!