మోదీ దృష్టిలో కశ్మీర్, లద్దాక్ ఏంటంటే..?

ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్‌ ఆర్టికల్ 370, కశ్మీర్‌, లద్దాక్‌ల విభజన అంశంపై మాట్లాడారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆర్టికల్ 370 రద్దుపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయితే విపక్షాల తీరుపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచార వేదికగా.. విపక్షాల వైఖరిని ఎండగట్టారు. జలగావ్‌ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ.. దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న […]

మోదీ దృష్టిలో కశ్మీర్, లద్దాక్ ఏంటంటే..?
Follow us

| Edited By:

Updated on: Oct 13, 2019 | 7:53 PM

ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్‌ ఆర్టికల్ 370, కశ్మీర్‌, లద్దాక్‌ల విభజన అంశంపై మాట్లాడారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆర్టికల్ 370 రద్దుపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయితే విపక్షాల తీరుపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచార వేదికగా.. విపక్షాల వైఖరిని ఎండగట్టారు. జలగావ్‌ జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ.. దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలపై కొన్ని ప్రతిపక్ష పార్టీలు, నేతలు వ్యతిరేకించడం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆర్టికల్ 370 రద్దుపై పాక్ మాట్లాడిన తీరుగానే విపక్షాలు కూడా మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. మీ ఎన్నికల మానిఫెస్టోలో ఆర్టికల్ 370 రద్దును పునరుద్దరిస్తామని చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు. కశ్మీర్, లద్దాక్‌లు కేవలం భారత భూభాగాలు మాత్రమే కాదని.. అవి దేశానికి కిరీటం లాంటివి అని వర్ణించారు.

కశ్మీర్ విషయంలో భారత్‌కు ప్రపంచ దేశాలన్నీ సమర్ధిస్తున్నాయన్నారు. నవభారతం ఉత్సహాం కేవలం ప్రధాని వల్ల కాదని.. మీ ఓటు వల్లే అది సాకారమవుతుందని అన్నారు. జరగబోతున్న ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలిచి.. రెండోసారి దేవేందర్ ఫడ్నవీస్‌ను సీఎంను చేయాలని ఓటర్లకు విన్నవించుకున్నారు.