మరోసారి ‘జనతా కర్ఫ్యూ’..

మహారాష్ట్ర రెండో రాజధాని నాగ్‌పూర్‌లో రెండు వారాంతాల్లో కర్ఫ్యూ పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 18 రాత్రి నుంచి సెప్టెంబర్ 21 ఉదయం వరకు, సెప్టెంబర్ 25 రాత్రి నుంచి సెప్టెంబర్ 28 ఉదయం వరకు జనతా కర్ఫ్యూ పాటించనున్నారు. 

మరోసారి 'జనతా కర్ఫ్యూ'..
Follow us

|

Updated on: Sep 17, 2020 | 7:47 PM

మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూ .. అవును ఇది నిజం.. మరోసారి అక్కడి ప్రజలు కరోనా కట్టడికి ఇదే బెస్ట్ అని అనుకున్నారు. అంతే పాటిస్తున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి పలు నగరాలు, పట్టణాల్లోని ప్రజలు మహమ్మారిపై పోరాడేందుకు స్వచ్ఛంద జనతా కర్ఫ్యూ పాటిస్తున్నారు.

మహారాష్ట్ర రెండో రాజధాని నాగ్‌పూర్‌లో రెండు వారాంతాల్లో కర్ఫ్యూ పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 18 రాత్రి నుంచి సెప్టెంబర్ 21 ఉదయం వరకు, సెప్టెంబర్ 25 రాత్రి నుంచి సెప్టెంబర్ 28 ఉదయం వరకు జనతా కర్ఫ్యూ పాటించనున్నారు.

పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, పెరుగుతున్న మరణాల నేపథ్యంలో సామాన్యులు చేసిన డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని నాగ్‌పూర్ మేయర్ సందీప్ జోషి తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ రోజుల్లో ఇళ్లనుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. నాగ్‌పూర్‌తోపాటు, సాంగ్లి, కొల్హాపూర్, జల్గావ్, రాయ్‌గడ్, ఔరంగాబాద్‌లాంటి ఇతర పట్టణాల్లో ‘జనతా కర్ఫ్యూలు’ అమలు చేస్తున్నారు.